Ashwayuja Masam : ఆశ్వయుజ మాసం ఎందుకు స్పెషల్.. కారణాలేంటి ?
Ashwayuja Masam : ఓ వైపు దుర్గా నవరాత్రులు.. మరోవైపు బతుకమ్మ.. ఇంకోవైపు దసరా.. ఇలా పవిత్ర పర్వదినాలన్నీ వచ్చేది ఆశ్వయుజ మాసంలోనే!!
- By Pasha Published Date - 10:51 AM, Sun - 15 October 23
Ashwayuja Masam : ఓ వైపు దుర్గా నవరాత్రులు.. మరోవైపు బతుకమ్మ.. ఇంకోవైపు దసరా.. ఇలా పవిత్ర పర్వదినాలన్నీ వచ్చేది ఆశ్వయుజ మాసంలోనే!! ఆశ్వయుజి అంటే స్త్రీ అని, దేవి అని అర్థం. అందుకే ఆశ్వయుజాన్ని ‘శక్తిమాసం’ అని పిలుస్తారు. ఈ మాసం శక్తి (అమ్మవారి) ఆరాధనకు ప్రత్యేకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు అశ్వినీ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి ఆశ్వయుజ మాసం అనే పేరు వచ్చిందని అంటారు. వాస్తవానికి ఆశ్వయుజమే తెలుగు నెలల్లో మొదటి నెలగా ఉండాలి. కానీ చాంద్రమానం ప్రకారం చైత్రమాసం మొదటిది అయింది. అదెలా అంటే అశ్విని నుంచి రేవతి వరకూ మొత్తం 27 నక్షత్రాల్లో మొదటి 13, వెనక 13 నక్షత్రాలను విడిచి పెట్టి మధ్యలోఉన్న 14వ నక్షత్రమైన చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడుకున్న పౌర్ణమి ఉండడంతో చైత్రం మొదటి తెలుగు నెల అయింది. కానీ ఉపాసనకు సంబంధించినంత వరకు ఆశ్వయుజ మాసమే మొదటి మాసం అవుతుందని పండితులు చెబుతుంటారు. తెలుగు క్యాలెండర్ లోని రెండో అర్ధ భాగంలో తొలి మాసం (Ashwayuja Masam) కూడా ఇదే కావడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join.
దేవతలకు బ్రహ్మముహూర్తం ఇదే
హిందూ ధర్మంలో బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది. సూర్యోదయానికి ముందున్న కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తాం. సంవత్సరం మొత్తాన్ని దేవతలకు ఒక రోజుగా భావిస్తే.. అందులో ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు ఉండే తొమ్మిది రోజుల టైంను దేవతలకు తెల్లవారుజాము (బ్రహ్మ ముహూర్తం) సమయంగా పరిగణిస్తారు. అందుకే పూజలు చేయడానికి, ఉపవాసాలు చేయడానికి ఈ నవరాత్రులు చాలా యోగ్యమైనవి. ఈ 9 రాత్రులు, 9 పగలు క్రమం విడిచిపెట్టకుండా దైవచింతనలో ఉండాలని చెబుతారు.
శరన్నవరాత్రులు
- ప్రతీ సంవత్సరం 2 నవరాత్రులు చేస్తారు.
- ఒకటి ఉత్తరాయణంలో వచ్చే చైత్ర నవరాత్రులు. రెండోది ఆశ్వయుజంలో వచ్చే శరన్నవరాత్రులు.
- ఆశ్వయుజ మాసంలో చేసే నవరాత్రుల పూజల వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
దుర్గాష్టమి
- నవరాత్రులలో అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల కుజ దోషాలు, రాహుకేతు దోషాలు తొలగుతాయి. ఎందుకంటే.. అమ్మవారు కుజగ్రహానికి, రాహు గ్రహానికి అధిపతి.
విజయదశమి
- ఆశ్వయుజ మాసంలో వచ్చే ఆశ్వయుజ శుక్ల దశమిని విజయదశమి అంటారు.
- దశమి రోజున ఎలాంటి పనినైనా ముహూర్తంతో పనిలేకుండా చేయొచ్చని అంటారు.ఈ రోజు ఏ పనియైనా అమ్మవారిని పూజించి ప్రారంభిస్తే విజయం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు.
- ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా పిలుస్తారు. ఆ రోజున సత్యభామ కృష్ణులు కలిసి నరకాసుని వధించినట్లుగా పురాణాలు చెబుతాయి.
Also Read: Shanaka Ruled Out: శ్రీలంక జట్టుకు బిగ్ షాక్.. గాయం కారణంగా కీలక ఆటగాడు దూరం..!
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.
Related News
MLC Kavitha: బతుకమ్మ చీరలతో రాజకీయం చేసిన కాంగ్రెస్ కు మహిళలు కర్రుకాల్చి వాతపెడుతారు!
సీఎం కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.