1992 Ajmer Gangrape: 100 మందికి పైగా విద్యార్థినులపై సామూహిక అత్యాచారం, 32 ఏళ్ల క్రితం జరిగిన పీడ కల
1992లో పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న 100 మందికి పైగా విద్యార్థినులపై సామూహిక అత్యాచారం జరిపి వారి నగ్న ఫోటోలు ప్రచారం చేయడం కలకలం రేపింది. పరువు పోతుందనే భయంతో చాలా మంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీని తరువాత, అప్పటి భైరో సింగ్ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిఐడి-సిబికి అప్పగించింది.
- By Praveen Aluthuru Published Date - 10:50 PM, Tue - 20 August 24

1992 Ajmer Gangrape: 32 ఏళ్ల క్రితం అజ్మీర్‌లో జరిగిన దేశంలోనే అతిపెద్ద లైంగిక ఘటనలో ఆరుగురు దోషులకు జిల్లా కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. నిందితులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున జరిమానా కూడా విధించారు.
1992లో పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న 100 మందికి పైగా విద్యార్థినులపై సామూహిక అత్యాచారం జరిపి వారి నగ్న ఫోటోలు ప్రచారం చేయడం కలకలం రేపింది. పరువు పోతుందనే భయంతో చాలా మంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీని తరువాత, అప్పటి భైరో సింగ్ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిఐడి-సిబికి అప్పగించింది.
అజ్మీర్ కేసులో ఎంత మంది నిందితులు ఉన్నారు?
గతంలో అజ్మీర్ గ్యాంగ్ రేప్, బ్లాక్ మెయిల్ కేసులో 60 ఏళ్ల సయ్యద్ జమీర్ హుస్సేన్, 55 ఏళ్ల నసీమ్ అలియాస్ టార్జాన్, 55 ఏళ్ల సలీం చిస్తీ, 54 ఏళ్ల నఫీస్ చిస్తీ, 53 ఏళ్ల సోహైల్, 52 ఏళ్ల ఇక్బాల్ ఖాన్ ఉన్నారు. అయితే సంఘటన జరిగిన సమయానికి ఈ నిందితులందరి వయస్సు దాదాపు 20 నుండి 28 సంవత్సరాలు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులు ఉండగా, వారిలో నలుగురికి ఇప్పటికే శిక్షలు ఖరారు చేయగా, నలుగురిని నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. ఈ కేసులో ఒకరు 30 ఏళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరిపై ఇంకా కేసు కొనసాగుతుండగా, ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఇది 1990 నుండి 1992 వరకు జరిగిన సెన్సేషన్ వార్త. అజ్మీర్‌లోని ప్రభావవంతమైన ప్రభువులు వివిధ పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న 17 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్సు గల 100 మందికి పైగా బాలికలను వివిధ మార్గాల్లో ట్రాప్ చేశారు. వాళ్ళ న్యూడ్ ఫోటో తీసి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు.ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే అబ్బాయిలు అత్యాశకు గురై వందల సంఖ్యలో న్యూడ్ ఫొటోలను ప్రింట్ చేసి మార్కెట్ లో అమ్మేశారు. కొంతమంది బాధితులు తమ తమ కష్టాలను చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు, మరికొందరు చేశారు, కొన్ని కుటుంబాలు పోలీసులను ఆశ్రయించినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పరువు పోతుందనే భయంతో బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆరుగురికి పైగా బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు.. అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మేల్కొంది.

1992 Ajmer Gangrape
విషయం ఎలా వెల్లడైంది?
స్థానిక వార్తాపత్రికకు చెందిన రిపోర్టర్ సంతోష్ గుప్తా ఈ కేసును బహిర్గతం చేశారు. ఈ వార్త జనాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పట్లో సోషల్ మీడియా లేకపోయినా ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఆ సమయంలో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది మరియు భైరాన్ సింగ్ షెకావత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చర్యలు తీసుకోవాలని భైరోన్ సింగ్ షెకావత్ ఆదేశించారు. అలాగే నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని, నేరగాళ్లను విడిచిపెట్టవద్దని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత కూడా పోలీసులు ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేసి నగరం నుంచి పారిపోయే అవకాశం వచ్చింది.
చివరకు ప్రజలు వీధుల్లోకి వచ్చి అజ్మీర్ బంద్ ప్రకటించారు. నేరస్తులను శిక్షించడంలో నగరంలోని పౌర హక్కుల స్పృహ సంస్థలు చురుకుగా మారాయి. పోలీసులపై ఒత్తిడి రావడంతో అప్పటి డిప్యూటీ సూపరింటెండెంట్ హరిప్రసాద్ శర్మ 1992 మే 3న కేసు నమోదు చేశారు. మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చి రహస్య విచారణ జరపాలని కోరారు. గోప్యత విచారణలో నిజాలు బయటకు రావడంతో కిరాతకుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని.. పెండింగ్‌లో పెట్టే ప్రయత్నం చేశారు.

1992 Ajmer Gangrape
గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ముఠా జాబితా:
ఫరూక్ చిస్తీ (యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు )
నఫీస్ చిస్తీ (యూత్ కాంగ్రెస్ నగర ఉపాధ్యక్షుడు)
అన్వర్ చిస్తీ (జాయింట్ సెక్రటరీ)
అల్మాస్ మహరాజ్ (కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సమీప బంధువు, అతను పరారీలో ఉన్నాడు)
ఇష్రత్ అలీ
ఇక్బాల్ ఖాన్
సలీం చిస్తీ
జమీర్ హుస్సేన్
సోహైల్ ఘని
మొయిజుల్లా పుట్టన్ అలహబాది
నసీమ్ అహ్మద్ అకా టార్జాన్
పర్వేజ్ అన్సారీ (నిర్దోషి)
మొహిబుల్లా అలియాస్ మారడోనా
కైలాష్ సోని (బారి)
మహేష్ లుధాని (నిర్దోషి)
పురుషోత్తం అలియాస్ బాబ్లీ
హరీష్ తోలాని (నిర్దోషి)
జుహూర్ చిస్తీ

1992 Ajmer Gangrape
కేసు విచారణ మరియు న్యాయం ఎలా ముందుకెళ్లింది?
30 నవంబర్ 1992న, అజ్మీర్ కోర్టులో మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేయబడింది, ఇందులో మొత్తం 18 మంది నిందితులుగా పేర్కొన్నారు. 1994లో నిందితుడు పురుషోత్తం బెయిల్‌పై బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. 1998 మే 18న ఫాస్ట్ ట్రాక్ కోర్టు మొదటి తీర్పును వెలువరించింది. అందరికీ జీవిత ఖైదు విధించారు. 20 జూలై 2001న, హైకోర్టు తన తీర్పును ఇచ్చింది, అందులో నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. డిసెంబర్ 19, 2003 న నలుగురు దోషుల జీవిత ఖైదును 10 సంవత్సరాలకు తగ్గించింది. ఆగస్టు 20, 2024న ప్రత్యేక పోక్సో చట్టం కోర్టు (జిల్లా కోర్టు) ఆరుగురు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడు జహూర్ చిస్తీపై తీర్పు పెండింగ్‌లో ఉంది. శిక్షాకాలం ముగిసిన తర్వాత ఫరూక్ చిస్తీ 2013లో విడుదలయ్యాడు. అల్మాస్ మహరాజ్ పరారీలో ఉన్నాడు, అతనిపై రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేయబడింది.
Also Read: Pocharam Srinivas Reddy: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి