Ukraine Russia War: ఉక్రెయిన్ పై రష్యా పంజా.. పోలీస్ కార్యాలయాన్ని లేపేశారు..!
- By HashtagU Desk Published Date - 04:04 PM, Wed - 2 March 22

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తున్నా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రష్యా దేశ సైనిక దళాలు అన్ని వైపుల నుంచి విరుచుకు పడుతుండడంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు ఖార్కీవ్ పైన కూడా రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఖార్కీవ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రాంతీయ కార్యాలయంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 21 మంది మృతి చెందగా, 112 మంది గాయపడినట్లు ఖార్కీవ నగర మేయర్ తెలిపారు.
రష్యా క్షిపణి దాడిలో పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రాంతీయ కార్యాలయం తగలబడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఇతర మంత్రులు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపధ్యంలో ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో రష్యా దాడులు చేస్తోందని, ఉక్రెయిన్ ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. రష్యా సైనిక బలగాలు చేస్తున్న దాడులో, అమాయక పౌరులు, పిల్లలు, ప్రాణాలు కోల్పోతున్నారని, ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా పైఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా రష్యా సైనిక బలగాల దెబ్బకి ఖార్కీవ్ గజగజ వణికిపోతుంది.
The mayor of #Kharkiv says at least 21 people have been killed & 112 injured during the last 12h of shelling.
The city’s going through another day of heavy fighting.
The regional police department has also been hitpic.twitter.com/wDuouoDyuc#Ukraine
— Daniele Palumbo (@Danict89) March 2, 2022