Maa Nanna Super Hero Review & Rating : మా నాన్న సూపర్ హీరో రివ్యూ & రేటింగ్
- By Ramesh Published Date - 07:26 AM, Fri - 11 October 24

Maa Nanna Super Hero Review & Rating సుధీర్ బాబు హీరోగా అభిలాష్ కంకర డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మా నాన్న సూపర్ హీరో. షయాజి షిండే, సాయి చంద్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాలో అర్నా ఓహ్రా హీరోయిన్ గా నటించింది. శ్రీ చక్రా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సునీల్ బలుసు ఈ సినిమా నిర్మించారు. దసరా కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
చిన్న వయసులోనే నాన్నని దూరం చేసుకుంటాడు జానీ (సుధీర్ బాబు). తన తండ్రి ప్రకాష్ (సాయి చంద్)ను దూరం చేసుకున్న జానీ అనాథాశ్రమం లో పెరుగుతాఉ. అదే టైం లో జానిని మరో వ్యక్తి (షయాజి షిండే) దత్తత తీసుకుంటాడు. జానీని దత్తత తీసుకున్న టైం నుంచి అతనికి కలిసి రాకపోవడంతో జానిని అసహ్యించుకుంటాడు. జానె పెరిగి పెద్దవాడై తండ్రి చేసిన తప్పులు సరిచేస్తాడు.. అప్పులు తీరుతాడు. అలా ఒక టైం లో జాని తండ్రిన్ని పోలీసులు జైల్ లో వేస్తారు అతను బయటకు రావాలంటే 1 కోటి అవసరం అవుతుంది. అప్పుడు జానీ ఏం చేశాడు. నాన్న కు సంబందించిన విషయాలు తెలుసుకుని జాని ఏం చేశాడు. నాన్నని జానీ బయటకు తెస్తాడా లేదా అన్నది సినిమా కథ.
విశ్లేషణ :
మా నాన్న సూపర్ హీరో.. ఇది ఒక తండ్రి కొడుకుల ప్రేమ కథ. ఐతే కామన్ గా ఒక తండ్రి ఒక కొడుకు కథ అనుకుంటే పొరబడినట్టే. ఇద్దరు తండ్రులు ఒక కొడుకు కథ ఇది. తండ్రి అంటే ఇష్టం ఉన్న ఒక వ్యక్తి కథ. అతనికి ఇద్దరు తండ్రులు ఉన్నారని తెలుసుకుని వారిని ఎలా కలిశాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే మా నాన్న సూపర్ హీరో (Ma Nanna Super Hero Review & Rating) కథ. ఐతే ఈ సినిమాను డైరెక్టర్ అభిలాష్ హ్యాండిల్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది.
సినిమా ఎక్కడ ఫన్ కావాలో అక్కడ అందిస్తూ మరోపక్క సినిమా కథకు కావాల్సిన ఎమోషనల్ కంటెంట్ కూడా కరెక్ట్ గా ఉనేలా చూసుకున్నారు. అంతకుముందు లూజర్ అనే వెబ్ సీరీస్ చేసిన డైరెక్టర్ అభిలాష్ ఈసారి వెండితెర మీద తన తొలి ప్రయత్నం తోనే మెప్పించాడు. రాసుకున్న కథకు తగిన పాత్రలను ఎంచుకుని సినిమాకు తన ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు.
ఫస్ట్ హాఫ్ లైటర్ వేలో తీసుకెళ్లిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ మంచి ఎమోషనల్ టచ్ ఇస్తూ క్లైమాక్స్ ని కూడా ఆకట్టుకునేలా చేశాడు. ఈమధ్య కాలంలో మంచి ఆహ్లాదకరమైన సినిమాగా మా నాన్న సూపర్ హీరో సినిమా అవుతుని. దసరాకి ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఐతే సినిమా నరేషన్ అక్కడక్కడ స్లో అయినట్టు అనిపిస్తుంది. అది సినిమా మీద అంతగా ఎఫెక్ట్ పడేలా చేయలేదు.
ఫైనల్ గా ఫెస్టివల్ టైం లో మంచి ఫ్యామిలీ ఎమోషన్ తో సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో సినిమా మంచి కథ క్థనంతో ఇంప్రెస్ చేసింది.
నటీనటులు & సాంకేతిక వర్గం :
సుధీర్ బాబు సినిమా సినిమాకు తన టాలెంట్ చూపిస్తున్నాడు. జానీ పాత్రలో అతను చూపించిన అభినయం ఇంప్రెస్ చేసింది. సుధీర్ బాబులో ఇంత ఎమోషన్, ఫన్ ఉంటుందని ఊహించలేదు. ఈ సినిమాలో అతనికి 100కి 100 మార్కులు వేసేయొచ్చు. ఆ తర్వాత షయాజి షిండే కూడా తను ఇదివరకు చేయని టిపికల్ ఫాదర్ రోల్ చేసి మెప్పించారు. సాయి చంద్ ఎప్పటిలానే అదరగొట్టారు. తన సహజ నటన ఆడియన్స్ ని మెప్పిస్తుంది. సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆర్నా ఓహ్రాకి అంత ప్రాముఖ్యత ఉన్న పాత్ర కాకపోయినా ఉన్నంతలో బాగానే చేసింది. ఇక మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు నటించి మెప్పించారు.
మా నాన్న సూపర్ హీరో టెక్నికల్ టీం విషయానికి వస్తే.. సినిమా నేపథ్యానికి తగినట్టుగా జై క్రిష్ మ్యూజిక్ ఇంప్రెస్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సమీర్ కళ్యాణ్ కెమెరా వర్క్ ఆకట్టుకుంది. డైరెక్టర్ గా అభిలాష్ అన్ని విధాలుగా తన ప్రతిభ కనబరిచాడు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత అవసరమో అంత బడ్జెట్ పెట్టినట్టు అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
సుధీర్ బాబు
ఫాదర్ అండ్ సన్ సీన్స్
ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
కొన్ని చోట్ల స్లో అవ్వడం
హీరోయిన్ సీన్స్ తక్కువ అనిపించడం
బాటం లైన్ :
సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో.. సూపర్ ఎమోషనల్..!
రేటింగ్ : 3/5