HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Movie Reviews
  • >Sir First Review This Master Has Won Hearts

Sir First Review: ఈ మాస్టార్ మనసులను గెలిచాడా!

  • By Balu J Published Date - 01:39 PM, Fri - 17 February 23
  • daily-hunt
Sir
Sir

రేటింగ్ : 3/5

హీరో ధనుష్ తమిళ్ నటుడే అయినా.. టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకు బీటెక్ రఘు వరన్ సినిమానే నిదర్శనం. అచ్చం ఆయన తెలుగు కుర్రాడిలా నటించి యూత్ ను ఆకట్టుకున్నాడు. అప్పట్నుంచీ ఆయన సినిమాలపై అంచనాలు నెలకొంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో భారీ అంచనాల మధ్య ‘సార్’ మూవీ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అయ్యింది. మరి ఈ మాస్టర్ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాడు అనేది తెరపై చూడాల్సిందే.

స్టోరీ 

బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్ గా ప్రమోషన్ వస్తోందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్ ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ?, ఈ మధ్యలో మీనాక్షి (సంయుక్తా మీనన్)తో బాలు కి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి ?, చివరకు బాలు జీవితం ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

చదువు జీవితాలనే మార్చేస్తుంది, చదువు ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుంది అనే కోణంలో సాగిన ఈ సార్ చిత్రం.. చదువు గొప్పతనం గురించి గొప్పగా చెప్పబడింది. ముఖ్యంగా ఈ చిత్రంలో కొన్ని ఎమోషన్స్ అండ్ ప్లే అలాగే సినిమాలో ఇచ్చిన మెసేజ్ ప్రేక్షకుల మనసును కదిలిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే.. చదువును ఆవిష్కరించే చిత్రం ఇది. వాస్తవిక ఎలిమెంట్స్ తో పాటు కథనం కూడా చాలా వాస్తవంగా సాగడంతో సినిమా పై ఆసక్తి పెరుగుతుంది. ఇక చదువుతో వ్యాపారం చేసే త్రిపాఠి లాంటి వ్యక్తుల స్వభావాన్ని కూడా చాలా బాగా చూపించారు.

అలాగే, అణగారిన వర్గాల స్టూడెంట్స్ ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి పై సమాజం ఒత్తిడి ఎలా ఉంది ? వంటి అంశాలను సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు వెంకీ. ధనుష్ నటన అద్భుతంగా అనిపిస్తోంది. మ్యాథ్స్ టీచర్ బాలుగా ధనుష్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఊరు నుంచి వెళ్లిపోయే సీన్ లో ధనుష్ నటన చాలా బాగుంది. అలాగే, క్లైమాక్స్ లో కూడా ధనుష్ పలికించిన హావభావాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి.

ఇక కీలక పాత్రల్లో నటించిన సుమంత్, మలయాళ నటుడు హరీష్ పేరడీ, తమిళనటుడు ఆడుకాలం నరేన్, సముద్రఖని, తనికెళ్ల భరణి, సాయి కుమార్ అలాగే మిగిలిన నటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దర్శకుడు వెంకీ అట్లూరి పనితీరు సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది. ఆయన డైలాగ్స్ కూడా కొన్ని చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

మనసును కదిలించే మెసేజ్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సార్ సినిమా ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో స్క్రీన్ ప్లే చాలా స్లో గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా దర్శకుడు వెంకీ అట్లూరి సెకండ్ హాఫ్ కథనాన్ని ఆసక్తికరంగా మలచలేకపోయారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను పర్వాలేదనిపించిన్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాలను స్లోగా నడిపాడు.

విశ్లేషణ

మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ విషయానికి వస్తే.. సెకండ్ హాఫ్ ను ఇంకా ఎఫెక్టివ్ గా ఎడిట్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

మొత్తానికి ఎలా ఉందంటే

‘సార్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుపోతాయి. ముఖ్యంగా చదువు జీవితాలనే మార్చేస్తుంది, ప్రతి ఒక్కరికి చదువు అందాలి అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది. ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది. ఐతే, సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్ కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథాకథనాలను రాసుకోలేదు. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. కానీ.. సినిమాలో ఎమోషన్ అండ్ మెసేజ్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. మొత్తమ్మీద ఈ చిత్రం ఆకట్టుకుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hanush
  • Samyuktha Menon
  • sir

Related News

    Latest News

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd