Avatar 2 Review: అవతార్-2 మూవీ రివ్యూ!
- By Balu J Published Date - 12:54 PM, Fri - 16 December 22
జేమ్స్ కామెరాన్ (Hollywood) పేరు చెప్పగానే అద్భుతమైన విజువల్ వండర్స్ గుర్తుకువస్తాయి. ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకెళ్తాయి. మైమరిస్తాయి. మట్లాడుకునేలా చేస్తాయి. అందుకు ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రపంచం మొత్తం కళ్లు అప్పగించి చూస్తోంది. ఆయన నుంచి వచ్చిన అవతార్, టైటానిక్ మూవీ ఏ స్థాయిలో ఆకట్టుకున్నాయో తెలిసిందే. తాజాగా మరోసారి అవతార్ 2తో మనముందుకొచ్చాడు. అవతార్ 2 (Avatar 2) చూసిన ఆడియన్స్.. ఆ మూవీని చూస్తూ తమని తాము మైమరచిపోతున్నారట. పండోరా ప్రపంచంలో విహరిస్తున్నారట.
స్టోరీ ఇదే
మనషుల్ని పండోరా గ్రహంపై నుంచి వెళ్లగొట్టిన నావి తెగ ప్రజలు చాలా ఆనందంగా బతుకుతుంటారు. కొంతమంది నమ్మకస్తులైన మనుషుల్ని మాత్రం అట్టిపెట్టుకుంటారు. ఇక హీరో జేక్ సల్లీ(శామ్ వర్తింగ్టన్), నేతిరికి ఇద్దరబ్బాయిలు, ఓ అమ్మాయి పుడుతుంది. డాక్టర్ గ్రేస్, ఫస్ట్ పార్ట్ చివర్లో చనిపోతుంది కదా, ఆమె జీన్స్ ఆధారంగా ఓ అవతార్ (Avatar) ని ల్యాబ్ లో క్రియేట్ చేస్తారు. దానికి కిరి అనే అమ్మాయి పుడుతుంది. ఈమెని కూడా జేక్ కుటుంబం దత్తత తీసుకుంటుంది. అలా నలుగురు పిల్లలతో జేక్ ఫ్యామిలీ పండోరాలోని హలలూయి మౌంటైన్స్(గాల్లో వేలాడే పర్వతాలు)లో హ్యాపీగా బతుకుతుంటారు. ఓ రాత్రి ఆకాశ వాసులు(మనుషులు) మళ్లీ పండోరాపై తిరిగొస్తారు. ఫస్ట్ పార్ట్ లో ఆర్మీ కల్నల్ మైల్స్ చనిపోతాడు కదా. అతడి జ్ఞాపకాలను భద్రపరిచి ఓ అవతార్ ని సృష్టిస్తారు. ఇక వీడు.. జేక్, అతడి భార్య నేతిరిపై పగ తీర్చుకోవాలని వెతుకుతుంటాడు. ఓ సందర్భంలో జేక్ పిల్లలు.. మైల్స్ బృందానికి దొరికిపోతారు. కానీ జేక్-నేతిరి కలిసి పిల్లల్ని చాకచక్యంగా కాపాడుతారు. ఇక తామున్న చోటు సేఫ్ కాదని అనుకుని మెట్కాయన్ గ్రామానికి వలసపోతారు. ఇక అక్కడే సముద్రవాసుల్లో ఒకరిగా కలిసిపోతారు. మరి జేక్ ఫ్యామిలీపై మైల్స్ బృందం పగ తీర్చుకుందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్లలోకి వెళ్లి సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
పండోరాలో దొరికే ఉనబ్టేనియం అనే విలువైన ఖనిజాన్ని దక్కించుకోవడానికి మనుషులు ఆ గ్రహంపైకి వెళ్తారు. అక్కడే ఉండే నావి ప్రజలు దానికి ఒప్పుకోరు. గొడవ జరుగుతుంది. యుద్ధం మొదలవుతుంది. అంత బలగం, గన్స్, యుద్ధ ట్యాంక్స్.. ఇలా ఎన్ని ఉన్నా సరే చివరకు నావి ప్రజలే విజయం సాధిస్తారు. ప్రమాదకరమైన మనుషుల్ని భూమ్మీదకు పంపించేస్తారు. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్లకు రెండో పార్ట్ అంతగా ఏం అనిపించదు. ఎందుకంటే స్టోరీ పరంగా దాదాపు ఒకేలా ఉంటుంది. అలానే ఫస్ట్ పార్ట్ చూడకుండా వెళ్తే.. ఈ సినిమా అస్సలు అర్థం కాదు.
ఇక ఫస్ట్ పార్ట్ ఓపెనింగ్ సీన్ పండోరా చూపించడం స్టార్ట్ అయి, జేక్ ఫేస్ చూపించడంతో ఎండ్ అవుతుంది. తాజాగా రిలీజైన సీక్వెల్ లోనూ సేమ్ షాట్స్ ఉంటాయి. జేమ్స్ కామెరూన్ దీన్ని సింబాలిక్ గా డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. రాబోయే పార్ట్స్ లో కూడా స్టార్టింగ్, క్లైమాక్స్ సీన్స్ లో ఇవే ఉంటాయనిపిస్తుంది. ఇక ఫస్ట్ పార్ట్ లో మైల్స్ ని చంపేశారు. దీంతో సెకండ్ పార్ట్ లో విలన్ ఎవరు అయ్యింటారా అని డౌట్ పడతారు. కానీ మనోడు ఇక్కడా ఉంటాడు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే మాత్రం అతడి క్యారెక్టర్ చాలా నార్మల్ గా అనిపిస్తుంది. ఇక మొదటి భాగంలో గాల్లో ఎగరడానికి ఇక్రాన్ అనే పక్షులు ఉంటాయి. ‘అవతార్ 2’ (Avatar2) లో ఈలు అనే సముద్ర జీవులు ఉంటాయి. జేక్ సల్లీ అండ్ ఫ్యామిలీ.. నీటిలో ఈలుని మచ్చిక చేసుకునే సీన్స్ విజువల్ గా చాలా చక్కగా ఉంటాయి. అయితే ఫస్టాప్ అంతా కూడా స్టోరీ సెట్ చేసుకోవడానికి సరిపోయింది. దీంతో సినిమా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.
రేటింగ్ 4.00
ఫ్లస్ పాయింట్స్
విజువల్ వండర్స్ గొప్పగా ఉన్నాయి
నటీనటుల ఫెర్మామెన్స్
మైనస్ పాయింట్స్
అవతార్ 1 కు మించి లేదు.
కొన్ని సీన్స్ బోరింగ్ ఉన్నాయి
సెకాండాఫ్ స్లోగా మూవ్ అవుతుంది.
Also Read: Mass Megastar: మెగా బ్లాస్టింగ్ కు ‘వాల్తేరు వీరయ్య’ రెడీ!
Related News
RRR : తగ్గేదేలే అంటున్న ఆర్ఆర్ఆర్.. జపాన్ లో ఇప్పటికే అదే క్రేజ్.. హాలీవుడ్ పాప్ సింగర్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా కలెక్షన్ ల మోత మోగించింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల అయ్యి కోట్లలో కలెక్షన్స్ ను సాధించింది. కాగ�