Offbeat: మలకు ఆ వాసన ఇష్టం.. అలా వాసన వచ్చేది ఆ వైరస్ వల్లే!
తాజాగా వైరస్ లకు ఉన్న మరొక శక్తి పరిశోధనల్లో బయటపడింది.
- By Nakshatra Published Date - 08:30 AM, Sun - 10 July 22
తాజాగా వైరస్ లకు ఉన్న మరొక శక్తి పరిశోధనల్లో బయటపడింది. వైరస్ లు మనుషుల నుంచి వచ్చే వాసనలను మార్చేస్తాయని, ఆ వాసనలను దోమలు బాగా ఆకర్షిస్తాయని తేలింది. అలా ఆ వాసన దోమలను ఆకర్షించి అవి మనల్ని కుట్టడం ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందేందుకు మార్గం వేసుకుంటున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. తాజాగా అమెరికాకు చెందిన కనెక్టీకట్ యూనివర్సిటీ చైనాలోని బీజింగ్ సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ అంశంపై పరిశోధన జరపగా దోమల ద్వారా వచ్చే మలేరియా డెంగ్యూ చికెన్ గుయ్యవంటే జ్వరలతో ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల మంది చనిపోతున్నారని, అంతేకాకుండా ఈ వ్యాధుల బారిన పడి కోట్లాదిమంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తేలింది.
కాగా ఈ వ్యాధులు వ్యాపించడానికి గల ప్రధాన కారణం దోమలు. ఒక రోగిని కుట్టిన దోమలు వెళ్లి మరొకరిని కుట్టడంతో అలా అందరికీ వ్యాధులు వ్యాపిస్తాయట. ఈ క్రమంలోనే అప్పటికే వ్యాధిసోకిన వారిని దోమలు మరింత ఎక్కువగా కుడుతుండడాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అయితే అది ఎందుకు అన్న దిశగా పరిశోధన చేయగా, అసలు వైరస్ లే మన శ్వాసనలను మార్చేస్తున్నట్లు వారు పిలిచారు. అయితే వైరస్ సోకిన వారి చర్మం నుంచి ఆసిటోఫెనోన్ అనే ఒక వాసన వస్తుందట. ఆ వాసనకు దోమలు ఆకర్షించబడుతున్నట్టుబి గుర్తించాము అని తాజాగా కనెక్టీకట్ యూనివర్సిటీ ఇమ్యునాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంగ్వా వాంగ్ తెలిపారు.
బాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఈ అసిటోఫినోన్ తయారీలో కీలక పాత్ర వహిస్తుందని అని తెలిపారు. దాని వల్ల డెంగ్యూ జీకా వైరస్ బాసిల్లస్ బ్యాక్టీరియాపై ప్రభావం చూపి అసిటోఫెనోన్ ను పెంచుతాయని తెలిపారు. కాగా ఇదే ప్రయోగాన్ని మొదట ఎలుకలపై ప్రయోగించినట్లు వాళ్ళు వెల్లడించారు. అలా దోమలు ఆకర్షితం కావడం తగ్గిందని అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంగ్వా వాంగ్ వెల్లడించారు. ఇటువంటి ఉపయోగాలు మానవులపై చేస్తే దోమల భారీ నుంచి అలాగే వాటి సోకే రోగాల నుంచి రక్షించుకోవచ్చు అని వారు తెలిపారు.
Tags
Related News
Mosquito : ఈ మొక్కలు నాటితే దోమలు దరి చేరవు
దోమ ఏదైనా కుట్టినట్లయితే, ఆ ప్రాంతం వాపు మరియు దురదగా మారుతుంది మరియు తీవ్రమైన చర్మ సమస్యలకు దారితీస్తుంది.