Relationship Insurance Policy: ప్రేమ బంధానికి భీమా… ఇలా చేస్తే ప్రేమికులకు లక్షల్లో ఆదాయం?
జీవిత బీమా, ఆరోగ్య బీమాల గురించి చాలామందికి తెలుసు. కానీ ప్రేమ బంధానికి బీమా ఎందుకు ఉండకూడదు? అని ఒక యువకుడు ఆలోచించాడు. ఆ ఆలోచనను వెంటనే కార్యరూపం దాల్చి, దానిని వెంటనే వ్యాపార అవకాశంగా మార్చేశాడు. ప్రేమికులు తమ ప్రేమను కూడా బీమా చేయించుకోవచ్చని ప్రకటించాడు.
- By Kode Mohan Sai Published Date - 02:47 PM, Mon - 14 April 25

Relationship Insurance Policy: జీవిత బీమా, ఆరోగ్య బీమాల గురించి మనందరికీ తెలిసిందే. కానీ ప్రేమ బంధానికి బీమా ఎందుకు ఉండకూడదు? అని ఆలోచించిన ఓ యువకుడు, ఆ ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చేశాడు. ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రిలేషన్‌షిప్ ఇన్సూరెన్స్ పాలసీని రూపొందించి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందుబాటులోకి తెచ్చాడు.
ఈ పాలసీ ప్రకారం, ప్రేమికులు ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత వారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నా, చెల్లించిన మొత్తం కంటే పది రెట్లు ఎక్కువగా తిరిగి పొందొచ్చు. అయితే, ఇది ఒక్కటే షరతు మీదే నడుస్తుంది ఆ ప్రేమబంధం చివరకు పెళ్లి వరకూ చేరాలిసిందే. మధ్యలో విడిపోయిన జంటలకు మాత్రం ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు.
ప్రస్తుతం ప్రేమలో ఉన్న చాలా మంది వివాహం వరకు వెళ్తున్న వారి సంఖ్యా చాలా తక్కువ. కొందరు సంవత్సరాల పాటు ప్రేమించి చివరికి విడిపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతోనే ఈ యువకుడు ‘జికీ లవ్’ పేరుతో ఈ ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశ పెట్టినట్లు చెబుతున్నాడు.