Mysterious Pale Figure Caught On Cam : చీకట్లో వింతజీవి హల్ చల్.. అది ఏలియనేనా?!
ఎముకల గూడు లాంటి ఓ ఆకారం చీకట్లో కదలాడుతోంది.. ముసలి వ్యక్తి వంగి నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్నట్లుగా అది ఉంది..
- By Hashtag U Published Date - 07:00 PM, Mon - 18 July 22

ఎముకల గూడు లాంటి ఓ ఆకారం చీకట్లో కదలాడుతోంది.. ముసలి వ్యక్తి వంగి నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్నట్లుగా అది ఉంది.. అయితే బక్కగా మారిన వ్యక్తి నడుస్తూ వెళ్తున్నట్లున్నా అంత సన్నగా ఎలా ఉంటారనే డౌట్ వస్తోంది. చివరగా ఆ ఆకారం కలిగిన జీవికి రెండు చేతులు, రెండు కాళ్లూ ఉన్నట్లు కనిపిస్తున్నా… ముఖం మాత్రం అస్పష్టంగా ఉంది. ఇంతకీ ఇది మనిషా ? ఏలియనా ? అనేది ఆన్సర్ దొరకని క్వశ్చన్ గా మారింది. అమెరికాలోని కెంటకీలో ఉన్న మోర్ హెడ్ ప్రాంతంలో ఒక ఇంటి వెనుకనున్న గార్డెన్ నుంచి, వాహనం పక్క నుంచి ఈ జీవి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ట్విట్టర్ లోని Paranormality Magazine ఈ వీడియో ఫుటేజీని జులై 9న పోస్ట్ చేసింది. 33 సెకండ్ల ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటికే 5.25 లక్షలకుపైగా వ్యూస్, 6.6 వేల లైక్స్ వచ్చాయి. ఈ వీడియోలో కనిపిస్తోంది ఏలియన్ అయి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.
Here's the video of the Pale creature caught on a security cam near Moorhead, KY. #cryptid pic.twitter.com/jCexxlQTA0
— Paranormality Magazine (@ParanormalityM) July 9, 2022
నెటిజన్స్ ఏమంటున్నారు?
* చాలా మంది యూజర్లు ఇదంతా వట్టి ట్రాష్ అంటున్నారు. ” అది సీసీటీవీ ఫుటేజ్ లా అనిపించట్లేదు. నిజమైన దానిలా లేదు” అని ఒకరు కామెంట్ చేశారు.
* “ఇది ఇన్‌ఫ్రారెడ్ కావచ్చేమో. ఎందుకంటే ఆ జీవి నిజానికి డార్క్ కలర్‌లో ఉండి ఉండొచ్చు. నల్ల సూట్ ధరించి ఉండొచ్చు. దాన్ని ఇన్‌ఫ్రారెడ్ కెమెరా తెల్లగా చూపిస్తూ ఉండొచ్చు” అని మరో వ్యక్తి పేర్కొన్నారు.
* “నేను తాగి నిద్రపోయి… తెల్లారి నాలుగు గంటలకు లేచి.. మద్యం మత్తులో ఇలాగే నడుస్తాను” అని ఇంకొక నెటిజన్ తెలిపారు.