Lightning Strike: : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెరుపు వీడియో… 500 అడుగుల దూరంలో..?
- Author : Prasad
Date : 06-07-2022 - 10:26 IST
Published By : Hashtagu Telugu Desk
వర్షం పడుతున్నప్పుడు ఉరుములు, మెరుపులు చూసేందుకు ఉత్సాహంగా ఉంటాయి. కానీ ఆ వాతావరణంలో బహిరంగ ప్రదేశంలో నిలబడటం చాలా ప్రమాదకరం. ఆ సమయంలో పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. అయితే తాజాగా సోషల్ ఓ మెరుపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ మెరుపు మెరిసిన సమయంలో పిడుగు పడి ఓ చెట్టు పూర్తిగా కాలిపోయింది. ఈ దృశ్యాన్ని చూస్తున్న అక్కడి ప్రజలు అరుస్తూ ఉన్నారు. ఈ వీడియోను వైరల్‌హాగ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇది జూన్ 29 న యునైటెడ్ స్టేట్స్‌లోని మసాచుసెట్స్‌లోని డాన్వర్స్‌లో జరిగిందని పేర్కొంది.
వీడియోను చిత్రీకరించిన వ్యక్తి ViralHogతో మాట్లాడుతూ.. జూన్ 29న సాయంత్రం ఆలస్యంగా తన కుటుంబం ఉరుములతో కూడిన తుఫానును చూస్తోందని చెప్పాడు. ఆ వ్యక్తి తుఫానును మామూలుగా రికార్డ్ చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో పిడుగు పడిద్దని ఆయన గ్రహించలేదు. పిడుగుపాటు 500 అడుగుల దూరంలో ఓ చెట్టుపై మంటలు చెలరేగాయని ఆయన చెప్పారు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం మెరుపు అనేది తుఫాను మేఘాలు, భూమి మధ్య లేదా మేఘాల లోపల ఏర్పడే అసమతుల్యత వల్ల ఏర్పడే విద్యుత్ అని… చాలా వరకు మెరుపులు మేఘాలలోనే వస్తాయని పేర్కొంది. మెరుపు దాని చుట్టూ ఉన్న గాలిని సూర్యుని ఉపరితలం కంటే ఐదు రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడి చేస్తుంది. ఈ వేడి వల్ల చుట్టుపక్కల గాలి వేగంగా విస్తరించి కంపిస్తుంది. దీని ఫలితంగా మెరుపు వచ్చిన వెంటనే మనం ఉరుముల శబ్ధాన్ని వింటాము. వైరల్ హాగ్ ఈ వీడియో షేర్ చేసినప్పటినుంచి ఇప్పటి వరకు 20,000 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది.
Lightning is so cool! 😲🌩🎥#viralhog #lightning #news #weather pic.twitter.com/atSF5syZIv
— ViralHog (@ViralHog) July 5, 2022