HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # CM Jagan
  • # Business
  • # Jobs
  • # Telangana Formation Day

  • Telugu News
  • ⁄Off Beat
  • ⁄If You Book A Hotel In That Country You Will Get A Tourist Visa For Up To Six Months

Tourist VISA: ఆ దేశంలో హోటల్ బుకింగ్ చేసుకుంటే ఆరు నెలల వరకు టూరిస్ట్ వీసా

రష్యా తాజాగా టూరిస్ట్ వీసాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సహా 19 దేశాలకు

  • By Maheswara Rao Nadella Published Date - 10:00 PM, Sat - 25 February 23
  • daily-hunt
Tourist VISA: ఆ దేశంలో హోటల్ బుకింగ్ చేసుకుంటే ఆరు నెలల వరకు టూరిస్ట్ వీసా

రష్యా ప్రభుత్వం తాజాగా కొత్త వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై 19 దేశాలకు హోటల్ బుకింగ్స్ ఆధారంగా టూరిస్ట్ వీసాలను (Russia Tourist Visa) జారీ చేయనుంది. ఆ జాబితాలో భారత్ ఉండటం గమనార్హం. దీంతో భారతీయులు త్వరలో రష్యాలో పర్యటించాలనుకుంటే ముందుగా హోటల్ బుకింగ్స్ చేసుకుంటే తేలిగ్గా టూరిస్ట్ వీసా వచ్చే అవకాశం ఉంది.  భారత్‌తో పాటు బహ్రెయిన్, బ్రూనై, కంబోడియా, చైనా, ఇండోనేషియా, ఇరాన్, డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, కువైట్, లావోస్, మలేషియా, మెక్సికో, మయన్మార్, ఒమన్, సౌదీ అరేబియా,సెర్బియా, థాయిలాండ్, టర్కీ, ఫిలిప్పీన్స్ వంటి 19 దేశాలకు ఈ కొత్త వీసా విధానం అమల్లోకి రానుంది. దీంతో ఈ దేశాల పర్యాటకులు ఇకపై హోటల్ రిజర్వేషన్ చేసుకుంటే దాని ఆధారంగా ఆరు నెలల వరకు ఈజీగా టూరిస్ట్ వీసాను (Tourist Visa) పొందే వీలుంది. కాగా, రష్యా కొద్ది రోజుల క్రితమే 11 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని అందించడంతో పాటు భారత్‌ సహా కొన్ని దేశాలకు పర్యాటక వీసా అవసరాలను సులభతరం చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లో ఈ కొత్త వీసా విధానాలను ఆమెదించడం విశేషం. మరోవైపు త్వరలో ఇంకో 70 దేశాలకు ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

రష్యాను సందర్శించాలనుకుంటే:

Russia Tourist Visa

మీరు వేసవి కాలంలో (జూన్ నుండి ఆగస్టు వరకు) రష్యాను సందర్శించాలనుకుంటే.. సైబీరియాలోని బైకాల్ సరస్సును మీ ప్రయాణ జాబితాలో చేర్చుకోవచ్చు. ఆ సమయంలో బైకాల్ సరస్సు చాలా అందంగా ఉంటూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సరస్సు చుట్టుపక్కల ప్రాంతాలు మంచి పిక్‌నిక్ స్పాట్లుగా, వీకెండ్ టూర్లుగా, డే టూర్లుగా ఉంటాయి. అలాగే అక్కడ హైకింగ్, క్యాంపింగ్ కూడా చేసుకునే వీలుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద, పురాతనమైన, లోతైన మంచినీటి సరస్సుగా పేరుగాంచింది. దీంతో ఇది తప్పక చూడాల్సిందే. అలాగే, రష్యాలోని అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటైన సోచి నగరం కూడా సందర్శించడానికి గొప్ప‌గా ఉంటుంది. సోచి సాంస్కృతికంగా గొప్ప నగరం. అది రష్యా హస్త కళలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలోనే జూన్ 27 నుండి జూలై 2 వరకు అక్కడ జానపద హస్తకళల ప్రదర్శన జరగనుంది. దీంతో ఈ నగరాన్ని కూడా మీరు చూసిరావచ్చు.

Also Read:  Blood: ఈ ఆహార పదార్థాలు తింటే మీ రక్తం శుద్ధి అవుతుంది, హిమోగ్లోబిన్ లెవెల్ కూడా పెరుగుతుంది

Telegram Channel

Tags  

  • booking
  • Hotel
  • travel
  • Visa
  • visit
  • wild life
  • world
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Modi – Bihar : బీహార్ పై మోడీ ఫోకస్.. జూన్ 12 పాట్నా మీటింగ్ తో అలర్ట్

Modi – Bihar : బీహార్ పై మోడీ ఫోకస్.. జూన్ 12 పాట్నా మీటింగ్ తో అలర్ట్

వచ్చే లోక్ సభ ఎన్నికలు టార్గెట్ గా విపక్ష పార్టీలు జూన్ 12న బీహార్ రాజధాని పాట్నాలో భేటీ కాబోతున్నాయి. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్‌లో బీహార్‌లో(Modi - Bihar )పర్యటించనున్నారు.

  • Eye View : ఒక్క లుక్ లో సిటీ మొత్తం చూడొచ్చు.. మహానగరంలో జెయింట్ వీల్

    Eye View : ఒక్క లుక్ లో సిటీ మొత్తం చూడొచ్చు.. మహానగరంలో జెయింట్ వీల్

  • Most Miserable Country : దయనీయ దేశం జింబాబ్వే..ఇండియా ర్యాంక్ 103

    Most Miserable Country : దయనీయ దేశం జింబాబ్వే..ఇండియా ర్యాంక్ 103

  • Adani Metaverse : మెటావర్స్ లో అదానీ స్కిల్ సెంటర్.. ఏం నేర్పిస్తారంటే ?

    Adani Metaverse : మెటావర్స్ లో అదానీ స్కిల్ సెంటర్.. ఏం నేర్పిస్తారంటే ?

  • Ukraine: పుతిన్‌ హత్యకు ఉక్రెయిన్‌ కుట్ర?!

    Ukraine: పుతిన్‌ హత్యకు ఉక్రెయిన్‌ కుట్ర?!

Latest News

  • Premature Hair Greying: చిన్న వయసులోనే మీ జుట్టు కూడా తెల్లబడుతుందా.. తెల్లజుట్టుని ఎలా నియంత్రించాలో తెలుసుకోండిలా..!

  • Pakistani Intruder: పాకిస్థాన్ చొరబాటుదారుడిని హతమార్చిన భద్రతా బలగాలు

  • CM Jagan : రైతుల ఖాతాల్లోకి రైతు భ‌రోసా నిధులు.. ప‌త్తికొండ‌లో బ‌ట‌న్ నొక్క‌నున్న సీఎం జ‌గ‌న్‌

  • Andhra Pradesh : ఏపీలో రెండు రోజుల పాటు వ‌డ‌గాలులు వీచే అవ‌కాశం – ఐఎండీ

  • 4 Killed : ల‌క్నోలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. స్కూటీని ఢీకొట్టిన స్కార్పియో

Trending

    • China Hole To Earth : భూమికి 10 కిలోమీటర్ల రంధ్రం చేస్తున్న చైనా .. ఎందుకు?

    • Business Ideas: ఈ బిజినెస్ కి సీజన్‌ తో సంబంధం లేదు.. మార్కెట్ లో విక్రయిస్తే చాలు భారీగా లాభాలు..!

    • Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?

    • Business Ideas: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే పెట్టుబడి లేకుండా సులభంగా డబ్బు సంపాదించవచ్చు..!

    • Life After Death :చనిపోయిన వారితో ముచ్చట్లు పెట్టొచ్చట!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
  • Follow us on:
Go to mobile version