Rinky Chakma : అందాల సుందరిని కబళించిన క్యాన్సర్.. 28 ఏళ్లకే తుదిశ్వాస
Rinky Chakma : ఆమె పేరు రింకీ చక్మా. మాజీ ‘మిస్ ఇండియా త్రిపుర’.
- By Pasha Published Date - 03:09 PM, Fri - 1 March 24

Rinky Chakma : ఆమె పేరు రింకీ చక్మా. మాజీ ‘మిస్ ఇండియా త్రిపుర’. గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడిన రింకీ చక్మా తుదిశ్వాస విడిచింది. 28 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు చేరింది. క్యాన్సర్‌కు సంబంధించిన ట్యూమర్‌కు శస్త్రచికిత్స చేసినప్పటికీ.. ఆమె ప్రాణాలు నిలువలేదు. ఈనేపథ్యంలో ఈ ఏడాది జనవరి 27న ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రింకీ చక్మా చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. రింకీ చక్మా (Rinky Chakma) చనిపోయిందనే వార్త తెలిసి చాలామంది నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ప్రాణాంతక రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ రింకీ చక్మా ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు తలపైనా ఒక క్యాన్సర్ ట్యూమర్ వచ్చింది. కీమో థెరపీ, సర్జరీలు చేయించకున్నా ఉపశమనం దక్కలేదు. ఈ చికిత్సలతో తాను చాలా బలహీనపడ్డానని.. ఫోన్ కాల్స్ చేయొద్దని.. కేవలం మెసేజ్‌లు చేయాలని ఆమె జనవరి 27న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రిక్వెస్ట్ చేసింది. దీన్నిబట్టి క్యాన్సర్ చికిత్సతో ఆమె అనుభవించిన నరకాన్ని ఊహించుకోవచ్చు. ‘‘నేను, నా కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈవిషయం చాలామందికి తెలుసు. గత 2 సంవత్సరాలుగా నేను ఆస్పత్రుల్లోనే ఎక్కువగా ఉంటున్నాను. జీవితం సవాళ్లమయంగా మారింది’’ అని కూడా ఆమె తన పోస్టులో ప్రస్తావించింది. రింకీ చక్మా 2017లో మిస్ ఇండియా పోటీలో ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ అవార్డును గెలుచుకుంది. మానుషి చిల్లర్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.
Also Read : TS DSC 2024 : జిల్లాలవారీగా, కేటగిరీలవారీగా డీఎస్సీ పోస్టుల వివరాలివీ..
ఈ ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని నికరాగ్వా దేశ వనిత గెలుపొందించింది. 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో మిస్ నికరాగ్వూ షెన్నిస్ పలాసియోస్ విజేతగా నిలిచింది. గతేడాది విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఆమెకు కిరీటాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆఖరి రౌండ్‌లో.. జీవితంలో ఎవరిని మార్గదర్శిగా ఎంచుకుంటారని న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు.. 18వ శతాబ్దపు బ్రిటిష్ తత్వవేత్త, స్త్రీవాది మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్ అని సమాధానం ఇచ్చారు. ‘ఆమె సరిహద్దులను ఉల్లంఘించి చాలా మంది మహిళలకు అవకాశం ఇచ్చింది.. ఈ రోజు మహిళలకు ఎటువంటి పరిమితులు లేవు’ అని చెప్పారు.