HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Off Beat News
  • ⁄For True Love Height Has No Meaning

Love Story: అతడు 2 ఫీట్లు.. ఆమె 5 ఫీట్లు.. ఒక సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ!!

ప్రేమ (Love) గుడ్డిదని వాళ్ళు నిరూపించారు. మనకు ఎవరి పట్ల ప్రేమతో కూడిన భావాలు హృదయంలోకి వస్తాయో..

  • By Hashtag U Published Date - 07:10 AM, Mon - 5 December 22
Love Story: అతడు 2 ఫీట్లు.. ఆమె 5 ఫీట్లు.. ఒక సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ!!

ప్రేమ (Love) గుడ్డిదని వాళ్ళు నిరూపించారు. మనకు ఎవరి పట్ల ప్రేమతో కూడిన భావాలు హృదయంలోకి వస్తాయో.. ఆ వ్యక్తి చూడటానికి ఎలా ఉన్నా అతన్ని అంగీకరిస్తాం. ఈ స్టోరీలో మనం చర్చించబోయే జంటలలో ఒకరికి అదే జరిగింది.ఈ కపుల్స్ ను ఎవరు మొదటిసారి చూసినా… ఈ ఇద్దరు భార్యాభర్తలని నమ్మలేరు.ఎందుకంటే భర్త ఎత్తు చాలా తక్కువ.. భార్య ఎత్తు చాలా ఎక్కువ!! అయితే ఈ జంటది ప్రేమ వివాహం కావడం విశేషం. ఇంతకీ ఈ జంట ఎవరు ? వారి ప్రేమ కథ ఏమిటి?  అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ జంట ఎవరు ?

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. 2016లో పెళ్లి చేసుకున్న ఈ జంట పేరు జేమ్స్ లస్టెడ్ మరియు క్లో సమంతా లస్టెడ్. వీరిద్దరూ యూకేలోని నార్త్ వేల్స్ లో నివసిస్తున్నారు. ఇద్దరిదీ ఒకే ఊరు. జేమ్స్ వయసు 33 సంవత్సరాలు. అతను నటుడు , టీవీ ప్రెజెంటర్. అతని భార్య క్లో టీచర్. ఆమె వయస్సు 29 సంవత్సరాలు.  2021 జూన్ 2న వారిద్దరూ ఒక కొత్త రికార్డు సృష్టించారు. ఎత్తులో భారీ వ్యత్యాసం కలిగిన కపుల్ గా రికార్డును నెలకొల్పారు. జేమ్స్ యొక్క హైట్ 109.3 సెంటీ మీటర్లు (3 ఫీట్ల 7 ఇంచులు), అతని భార్య క్లో హైట్ 166.1 సెంటీ మీటర్లు (5 ఫీట్ల 5.4 ఇంచులు). ఈ రెండింటి మధ్య తేడా 56.8 సెంటీ మీటర్లు. అంటే ఈ ఇద్దరి హైట్ లో దాదాపు 2 అడుగుల (1 అడుగులు, 10 అంగుళాలు) వ్యత్యాసం ఉంది.

ప్రమాదకరమైన సిండ్రోమ్‌తో జేమ్స్..

జేమ్స్ మరుగుజ్జు యొక్క అరుదైన రూపాలలో ఒకటైన డయాస్ట్రోఫిక్ డైస్ప్లాసియాతో బాధపడుతున్నాడు, ఇది జన్యుపరమైన రుగ్మత. దీనివల్ల జేమ్స్ శరీరంలో ఎముకలు, నాడీ వ్యవస్థ పెరుగుదల ఆగిపోయింది. మరుగుజ్జుతనం కారణంగా తనకు జీవితంలో ఎన్నడూ పెళ్లి కాదని జేమ్స్ అనుకున్నాడు. కానీ 2012లో జేమ్స్ ..తన లవర్ క్లోను కలుసుకున్నాడు.అప్పుడు అతని మనసు మార్చుకున్నాడు.

ప్రేమకథ అలాంటిదే..

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌తో క్లో మాట్లాడుతూ..”నేను జేమ్స్‌ను కలిసినప్పుడు అతనితో ప్రేమలో పడ్డాను. ప్రజలు రకరకాలుగా చెబుతారని నాకు తెలుసు. అయినా వాళ్ళ మాటలు నన్ను ప్రభావితం చేయలేకపోయాయి” అని చెప్పింది. క్లో ఇంకా ఇలా అన్నాడు.. “మేమిద్దరం స్థానిక క్లబ్‌లో కలుసుకున్నాము. నేను ఆ సమయంలో ఇంకా చదువుతున్నాను. ఇద్దరం ఏడు నెలలు డేటింగ్ చేశాము. చివరగా, 2013 చివరలో జేమ్స్ నన్ను సరస్సు వద్దకు తీసుకువెళ్ళాడు. అతను మోకాళ్లపై కూర్చొని నాకు లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ ఫీలింగ్ నాకు చాలా బాగా అనిపించింది. నేను ఆ ప్రతిపాదనను అంగీకరించి పెళ్లి చేసుకున్నాను. ఈ రోజు మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము.”

మీరు చేసేవన్నీ నేనూ చేస్తా : జేమ్స్

జేమ్స్ ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు… “3 అడుగుల 7 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండటం లోపమే. కానీ నేను మీరు చేయగలిగినదంతా చేయగలను. నా కుమార్తెకు 4 సంవత్సరాలు. ఆమె నన్ను మరగుజ్జులా మాత్రమే కాకుండా ఒక ఆర్టిస్ట్ గా కూడా చూడబోతోంది. నార్త్ వేల్స్‌లోని సముద్రతీర పట్టణం లాండుడ్నోలో త్వరలో జరగబోయే పండుగ సీజన్‌లో ‘బ్యూటీ అండ్ ది బీస్ట్’లో బాబ్ అనే పాత్రను నేను పోషించబోతున్నాను” అని వివరించారు.

Tags  

  • 2 feet groom
  • love story
  • unique love story

Related News

Aishwarya Rai with Salman: ఐశ్వర్య – సల్మాన్ ‘కుచ్ కుచ్ హోతా హై’.. ఓల్డ్ పిక్ వైరల్!

Aishwarya Rai with Salman: ఐశ్వర్య – సల్మాన్ ‘కుచ్ కుచ్ హోతా హై’.. ఓల్డ్ పిక్ వైరల్!

సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ కు సంబంధించిన పాత ఫోటో (Old Pic) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  • Dhanush: శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ త్రిభాషా చిత్రం షురూ!

    Dhanush: శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ త్రిభాషా చిత్రం షురూ!

  • Naga Chaitanya: స్నేహబంధమా.. ప్రేమబంధమా! ఆ హీరోయిన్ తో చైతూ డేటింగ్!

    Naga Chaitanya: స్నేహబంధమా.. ప్రేమబంధమా! ఆ హీరోయిన్ తో చైతూ డేటింగ్!

  • Sonakshi Sinha: పెళ్లి కళ వచ్చేసిందే బాలా!

    Sonakshi Sinha: పెళ్లి కళ వచ్చేసిందే బాలా!

  • Ukraine Girl: ఉక్రెయిన్ అమ్మాయికి ‘ఢిల్లీవాలా’ లవ్ ప్రపోజ్.. త్వరలో పెళ్లి!

    Ukraine Girl: ఉక్రెయిన్ అమ్మాయికి ‘ఢిల్లీవాలా’ లవ్ ప్రపోజ్.. త్వరలో పెళ్లి!

Latest News

  • Night Club : గురుగ్రామ్ లో నైట్‌క్లబ్‌పై పోలీసుల రైడ్‌.. 288 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • U19 Women T20 World Cup 2023: నేడు ఇంగ్లండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. అడుగు దూరంలో టీమిండియా..!

  • Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ

  • Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?

  • Taliban Bans: మహిళలపై మరో నిషేధం విధించిన తాలిబన్లు.. ఈసారి ఏంటంటే..?

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: