International Day of the Girl Child: ప్రతి అమ్మాయి తప్పనిసరిగా చట్టపరమైన ఈ 5 హక్కుల గురించి తెలుసుకోవాలి..!!
అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలకు అనేక హక్కులు కల్పించబడ్డాయి.
- Author : hashtagu
Date : 11-10-2022 - 7:03 IST
Published By : Hashtagu Telugu Desk
అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలకు అనేక హక్కులు కల్పించబడ్డాయి. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను తగ్గించేందుకు మన దేశంలో కూడా ఎన్నో చట్టాలు, చట్టబద్ధమైన హక్కులను కల్పించారు. ఈ కథనంలో, ప్రతి అమ్మాయి తప్పనిసరిగా తెలుసుకోవలసిన 5 చట్టపరమైన హక్కుల గురించి తెలుసుకుందాం.
1) ఆఫీసుల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చట్టం:
ఒక అమ్మాయి తన ఆఫీసులో ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేసినట్లయితే లైంగిక వేధింపుల చట్టం 2013 ప్రకారం వేధింపులకు గురైన మహిళ ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. దీని ప్రకారం, మహిళలు లింగ సమానత్వం, స్వేచ్ఛను పొందే హక్కును పొందడంతోపాటు ఆఫీసుల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంలో ఈ చట్టం సహాయపడుతుంది.
2) ఆడ భ్రూణహత్యలను అరికట్టేందుకు:
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1972లో అమల్లోకి వచ్చింది. దీన్ని 2002లో కొన్ని మార్పులు కూడా చేశారు. ఈ చట్టం ద్వారా ఆడ భ్రూణహత్యలను అరికట్టేందుకు ప్రయత్నం చేశారు. చాలా మంది కడుపులో పుట్టిన బిడ్డను పరీక్షించి, కడుపులో ఆడపిల్ల ఉందని తెలిస్తే, ఆ గర్భిణికి అబార్షన్ చేయిస్తారు. దానికి వ్యతిరేకంగా ఈ చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం, ఏ అమ్మాయిని లేదా స్త్రీని చట్టవిరుద్ధంగా, బలవంతంగా గర్భస్రావం చేయకూడదు. అలా జరిగితే, అది చట్టవిరుద్ధం.
3) ఇంటర్నెట్ భద్రత కోసం చట్టాలు:
ఎవరైనా అమ్మాయి అభ్యంతరకరమైన ఫోటో లేదా వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తే, అది వెబ్‌సైట్ సంబంధిత చట్టాలకు విరుద్ధం. క్రిమినల్ లా యాక్ట్ 2013లోని సెక్షన్ 354 ప్రకారం శిక్షను కూడా పడుతుంది.
4) న్యాయ సహాయం పొందే హక్కు:
ఈ చట్టం ప్రకారం మన దేశంలో ఏ అమ్మాయి అయినా ఉచిత న్యాయ సహాయం కోరవచ్చు. ప్రతి రాష్ట్రంలోని బాలికలకు న్యాయ సహాయం అందించడానికి ఈ చట్టపరమైన హక్కు ఉంటుంది.
5) గోప్యతకు చట్టపరమైన హక్కు
ఒక మహిళ లేదా ఏదైనా అమ్మాయి గోప్యతను కాపాడుకోవడానికి, అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు గురైన మహిళ గుర్తింపు పూర్తిగా బహిరంగపరచబడకుండా ఉండటానికి గోప్యత హక్కు ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 ప్రకారం ఆమె ఈ హక్కును పొందుతుంది. దీనిలో ఆమె తన స్టేట్‌మెంట్‌ను మహిళా జిల్లా మేజిస్ట్రేట్ ముందు ఉంచవచ్చు.
అమ్మాయిల వేధింపులు ప్రతి రంగంలోనూ ఉన్నప్పటికీ, ముఖ్యంగా జాబ్ చేసే మహిళలను అవహేళన చేసే వారు ఎందురో ఉన్నారు. అలాంటివారికి బుద్ధి చెప్పేందుకు ఈ హక్కుల గురించి ప్రతి మహిళా తెలుసుకోవాలి.