AI తో చాల జాగ్రత్త.. ఫోన్ కాల్స్ కు సైతం రిప్లై ఇస్తున్నాయి
AI Calling AI : ఒక ఏఐ మరో ఏఐతో మాట్లాడటం మొదలుపెట్టింది. మొదటిగా ఇంగ్లీష్ భాషలోనే ముచ్చటించుకున్నాయి. ఆ తర్వాత మిషన్ లాంగ్వేజీ అనే కొత్త భాషలో కొనసాగించాయి
- By Sudheer Published Date - 02:34 PM, Wed - 5 March 25

AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ అభివృద్ధి ప్రతి రోజూ కొత్త ఆశ్చర్యాలను చూపిస్తోంది. మనం ఊహించని విధంగా ఇప్పుడు ఫోన్ కాల్స్‌కే సమాధానం ఇచ్చే స్థాయికి చేరుకుంది. ఇటీవల యూకేలో ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి హోటల్ బుకింగ్ కోసం ఏఐ అసిస్టెంట్‌ను ఉపయోగించాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే .. హోటల్‌లో కూడా ఒక ఏఐ అసిస్టెంట్ ఉండటంతో, ఆ కాల్‌ను స్వీకరించింది. దాంతో ఒక ఏఐ మరో ఏఐతో మాట్లాడటం మొదలుపెట్టింది. మొదటిగా ఇంగ్లీష్ భాషలోనే ముచ్చటించుకున్నాయి. ఆ తర్వాత మిషన్ లాంగ్వేజీ అనే కొత్త భాషలో కొనసాగించాయి.
Steve Smith: స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం.. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్!
ఈ మిషన్ లాంగ్వేజీని “గిబ్బర్ లింక్ మోడ్” అని పిలుస్తారు. ఇది మనుషులకు పూర్తిగా అర్థంకాని రీతిలో, కొన్ని విచిత్రమైన సౌండ్స్ చేస్తూ ఏఐలు మాట్లాడుకునే భాష. ఈ భాషను ప్రముఖ పరిశోధకులు బోరిస్, స్టార్ కోవ్, అంటోన్ పిడ్‌కుయ్‌కో అభివృద్ధి చేసినట్లు సమాచారం. సాధారణంగా మనుషులకు అర్థం అయ్యే భాషలోనే ఏఐలు స్పందిస్తాయని అనుకున్నప్పటికీ, ఈ ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, ఏఐ టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్లిందనే విషయం మరోసారి చర్చనీయాంశమైంది.
Kohli ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నయా ర్యాంక్‌లో విరాట్ కోహ్లీ!
ఇది కేవలం సాంకేతిక ప్రగతిని సూచిస్తున్నదా? లేక ఏఐ మనుషుల జీవితాలకు ముప్పు తెస్తుందా? అనే ప్రశ్నలు నెటిజన్లలో కలుగజేస్తున్నాయి. కొందరు “ఏఐ మరింత అధునాతన స్థాయికి చేరుకుంటోంది” అని హర్షిస్తుంటే, మరికొందరు “ఇది మనుషుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా?” అని ఆందోళన చెందుతున్నారు. రోబో మూవీల్లో చూపినట్లుగా ఏఐ మనుషులను వినిపించుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనే భయం వ్యక్తమవుతోంది. మనిషి ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ, ఏఐలు తమ మధ్య ప్రత్యేకమైన భాషలో ముచ్చటించడం భవిష్యత్తులో మరిన్ని ప్రశ్నలకు తావిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏఐ మరింత బలపడే అవకాశం ఉందని, దానిపై నియంత్రణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.