Mango Leaves : పండుగలు, ఫంక్షన్స్ సమయంలో ఇంటి ముందు మామిడి ఆకులు ఎందుకు కడతారో తెలుసా?
మన అందరం పండుగ(Festival) వచ్చిన లేదా మన ఇంటిలో ఏదయినా ఫంక్షన్ జరిగినా మన ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులను(Mango Leaves )కడతారు.
- By News Desk Published Date - 09:30 PM, Tue - 14 November 23

మన అందరం పండుగ(Festival) వచ్చిన లేదా మన ఇంటిలో ఏదయినా ఫంక్షన్ జరిగినా మన ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులను(Mango Leaves )కడతారు. ఇలా గుమ్మానికి మామిడి ఆకులను కట్టడం మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం. మామిడి తోరణాలు స్వచ్ఛత, పవిత్రతను సూచిస్తాయి. మామిడి తోరణాలు కట్టడం వలన మన ఇంటిలోని ప్రతికూల శక్తులు బయటకు పోయి సానుకూల శక్తులు ఇంటిలోనికి ప్రవేశిస్తాయి.
మామిడి ఆకులు చెట్టు నుంచి వేరయ్యాక కూడా గాలిలోని కార్బన్ డైయాక్సయిడ్ ని పీల్చుకొని ఆక్సిజన్ ను వదులుతాయి. మామిడి ఆకుల వలన మన ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే పూర్వకాలంలో బావిని శుభ్రం చేసేటప్పుడు ముందు దానిలో ఒక మామిడి కొమ్మను వేసి తిప్పుతారు ఆ తరువాత బావిలోకి దిగి శుభ్రం చేస్తారు. ఇలా చేయడం వలన దానిలో ఉండే విషవాయువులు తొలగిపోతాయి అని నమ్మేవారు. అలాగే ఇంట్లో ఏమన్నా విషవాయువులు ఉన్నా తొలిగిపోతాయి. మామిడి తోరణాలు కట్టడం వలన మన ఇంటిలో ఆర్ధిక సమస్యలు కూడా తగ్గుతాయి.
మామిడి తోరణాలు కట్టడం వలన అది మన ఇంటిలో సుఖసంతోషాలను ప్రోత్సహిస్తుంది. మామిడి తోరణాలను మన ఇంటి ముందు కట్టడం వలన మన ఇంటిలోనికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు. కేవలం ఇంటి గుమ్మాలకు మాత్రమే కాకుండా మనం పూజలు చేసేటప్పుడు కలశంలో కూడా మామిడి ఆకులను ఉంచుతారు. మామిడి చెట్టును కల్ప వృక్షంగా భావిస్తారు. వైదిక ఆచారాలలో మామిడి చెట్టును ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. అందుకే ప్రతి పండక్కి, ఫంక్షన్ కి కచ్చితంగా ఇంటి ముందు గుమ్మాలకు మామిడి ఆకులు కట్టుకోవాలి. ఇంటి ముందు మామిడి చెట్టు ఉంటె ఆ ఇంటికి ఎంతో మంచిది.
Also Read : Kartika Masam : నేటి నుంచి కార్తీకమాసం.. ఈ మాసంలో తులసి పూజ విశిష్టత ఇదీ