Plastic Stools : ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో రంధ్రాలు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా?
ప్లాస్టిక్ స్టూల్స్(Plastic Stools) మధ్యలో రంధ్రాలు(Holes) ఎందుకు ఉంటాయి దానివలన ఉపయోగం ఏంటి అని అప్పుడప్పుడు ప్రశ్నలు వస్తాయి.
- By News Desk Published Date - 09:30 PM, Mon - 12 June 23

ప్లాస్టిక్ స్టూల్స్(Plastic Stools) మధ్యలో రంధ్రాలు(Holes) ఎందుకు ఉంటాయి దానివలన ఉపయోగం ఏంటి అని అప్పుడప్పుడు ప్రశ్నలు వస్తాయి. చిన్నపిల్లలు అయితే ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. మనకు తోచిన సమాధానం మనం చెబుతుంటాము. కానీ దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. స్టూల్స్ మధ్యలో ఉండే రంధ్రాల వలన దాని మీద కూర్చున్న మనిషి బరువు స్టూల్ మొత్తం సమానంగా ఉండేలా చేస్తుంది. దీని వలన స్టూల్స్ మీద కూర్చున్న మనిషి కింద పడిపోరు, స్టూల్ విరిగిపోకుండా ఉంటుంది.
ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో ఉండే రంధ్రాలు చతురస్రాకారం, త్రిభుజాకారం, రాంబస్ వంటి షేపుల్లో కాకుండా చాలావరకు రౌండ్ గానే ఉంటాయి. వాక్యూమ్ లేకుండా ఉండడానికి కూడా ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో రంధ్రాలు ఉంటాయి. అంటే ఒక స్టూల్ లో ఒకటి వేసిన తరువాత తొందరగా రావడానికి కూడా ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో రంధ్రాలు ఉపయోగపడతాయి. దీని వలన వాక్యూమ్ అనేది రాకుండా ఉంటుంది. ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో రౌండ్ రంధ్రాలు పెట్టడం వలన మనం వాటిని తేలికగా తీయవచ్చు.
ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో ఉండే రంధ్రాలు మరీ పెద్దవిగా లేదా మరీ చిన్నవిగా కూడా ఉండవు. కనీసం మన వేలు పెట్టె సైజులో ఉంటాయి. అయితే ఇటీవల ప్రతి ప్లాస్టిక్ స్టూల్స్ కి రంధ్రాలు ఉండట్లేదు. కానీ సైన్స్ పరంగా ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో రంధ్రాలు ఉండడం వలన అవి ఎక్కువకాలం విరిగిపోకుండా ఉంటాయి.
Also Read : Head Bath: వారంలో ఆరోజు తల స్నానం చేస్తున్నారా.. ఇక అంతే సంగతులు?