Natural Eyebrow Tints: ఐబ్రోస్ నల్లగా మారాలంటే ఈ చిట్కాలు ఉపయోగిస్తే చాలు?
మామూలుగా చాలామందికి కనుబొమ్మలు దట్టంగా నల్లగా అందంగా ఉంటే మరి కొంతమందికే వెంట్రుకలు ఎక్కువగా పెరిగి తెల్లగా మారి అంద విహీనం
- By Nakshatra Published Date - 10:40 PM, Mon - 4 September 23
మామూలుగా చాలామందికి కనుబొమ్మలు దట్టంగా నల్లగా అందంగా ఉంటే మరి కొంతమందికే వెంట్రుకలు ఎక్కువగా పెరిగి తెల్లగా మారి అంద విహీనంగా ఉంటాయి. కనుబొమ్మలు లేకపోతే ఆ ముఖం చూడడానికి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనుబొమ్మలు తెల్లగా మారడానికి పోషకాహార లోపం ముఖ్య కారణం. జుట్టు రంగు మారడం, వృద్ధాప్యం, హార్మోన్ల సమస్యలు, ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా కనుబొమ్మల్ని తెల్లగా మారేలా చేస్తాయి. ఈ రోజుల్లో చాలామంది ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. కనుబొమ్మలు తెల్లగా ఉంటే వాటిని నల్లగా మారేందుకు కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్‌ని వాడతారు. కానీ, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కనుబొమ్మలు నల్లగా మారాలంటే ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మెలనిన్ అనేది మన జుట్టు, కనుబొమ్మల వెంట్రుకలు నల్లగా ఉండేందుకు సాయపడుతుంది. మెలనిన్ లోపం వల్ల కనుబొమ్మలు తెల్లగా మారేలా చేస్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జుట్టు తెల్లబడుతుంది. విటమిన్ బి 12, ఐరన్ వంటి పోషకాల లోపం వల్ల కూడా జుట్టు నెరిసిపోతుంది. అధిక స్థాయి ఒత్తిడి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కూడా ప్రేరేపించి కనుబొమ్మలు తెల్లగా మారేలా చేస్తుంది. మెలనిన్ ఉత్పత్తి కణజాలాలను దెబ్బతీసే ధూమపానం ఆక్సిడెంట్ ప్రభావం వల్ల మెలనోసైట్స్ ఏర్పడతాయి. కాబట్టి, ధూమపానం చేసేవారికి ముందుగా జుట్టు తెల్లబడుతుంది.
జుట్టుకి సహజమైన రంగుని ఇవ్వడానికి కాఫీ హెల్ప్ అవుతుంది. కాబట్టి, కాఫీ పొడిని కనుబొమ్మలు నల్లగా చేసేందుకు హెల్ప్ చేస్తుంది. ఇందుకోసం ఒక కప్పు నీరు రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడి తీసుకోవాలి. 2 టీ స్పూన్ల కాఫీ పొడిని 2 టేబుల్ స్పూన్ల చల్లని నీటితో కలపండి. తర్వాత దీన్ని వేడినీటిలో వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. మీరు ఈ పదార్థాన్ని కనుబొమ్మలకి రాయొచ్చు. 20 లేదా 30 నిమిషాల తర్వాత నీటిని కడగాలి.
మరొక రెమిడి విషయానికి వస్తే.. జుట్టు నెరసిపోకుండా ఉండేందుకు గూస్బెర్రీని వాడతారు. కాబట్టి, మీరు కనుబొమ్మల్ని నల్లగా మారేందుకు ఉసిరిని ఉపయోగించవచ్చు. ఇందుకోసం కావాల్సిన రెండే రెండు. ఒకటి ఆరు ఉసిరికాయలు రెండవది సరిపడా నీరు. ముందుగా ఉసిరిని కట్ చేసి చిన్న ముక్కలుగా చేయాలి. వేడినీటిలో వేసి బాగా మరిగించాలి.ఇప్పుడు ఆ నీటిని ఫిల్టర్ చేసి జుట్టుకి వాడొచ్చు.ఉసిరి రసం తాగడం వల్ల జుట్టు నెరవడాన్ని కూడా తగ్గించవచ్చు.
Related News
Natural Eyebrow Tints: నల్లటి ఐబ్రోస్ కావాలంటే.. అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే?
ముఖం అందంగా కనిపించాలి అంటే ముఖంపై అన్ని అందంగా కరెక్ట్ గా ఉండాలి. ఒకవేళ ముఖంపై ఐబ్రోస్ కనుక సర్లే లేకపోయినా పూర్తిగా లేకపోయినా తెల్లగా ఉన్న