Natural Eyebrow Tints: నల్లటి ఐబ్రోస్ కావాలంటే.. అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే?
ముఖం అందంగా కనిపించాలి అంటే ముఖంపై అన్ని అందంగా కరెక్ట్ గా ఉండాలి. ఒకవేళ ముఖంపై ఐబ్రోస్ కనుక సర్లే లేకపోయినా పూర్తిగా లేకపోయినా తెల్లగా ఉన్న
- By Anshu Published Date - 10:00 PM, Wed - 12 July 23

ముఖం అందంగా కనిపించాలి అంటే ముఖంపై అన్ని అందంగా కరెక్ట్ గా ఉండాలి. ఒకవేళ ముఖంపై ఐబ్రోస్ కనుక సర్లే లేకపోయినా పూర్తిగా లేకపోయినా తెల్లగా ఉన్నా కూడా ముఖం కాస్త అంద విహీనంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. అందుకే స్త్రీలు ఐబ్రోస్ కోసం ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు. ఐ లైనర్స్, ఐ కాజల్ అని ఇలా రకరకాలవి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఐబ్రోస్ నల్లగా ఉంటే మరి కొంతమందికి తెల్లగా ఉంటాయి. కొంతమందికి ఎరుపు రంగులో ఉంటాయి. మరి ఐబ్రోస్ నల్లగా మారాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కనుబొమ్మలు తెల్లగా ఉంటే వాటిని నల్లగా మారేందుకు కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్‌ని వాడతారు. కానీ, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే మెలనిన్ అనేది మన జుట్టు, కనుబొమ్మల వెంట్రుకలు నల్లగా ఉండేందుకు సహాయ పడుతుంది. మెలనిన్ లోపం వల్ల కనుబొమ్మలు తెల్లగా మారేలా చేస్తాయి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జుట్టు తెల్లబడుతుంది. విటమిన్ బి 12, ఐరన్ వంటి పోషకాల లోపం వల్ల కూడా జుట్టు నెరసిపోతుంది. అధిక స్థాయి ఒత్తిడి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కూడా ప్రేరేపించి కనుబొమ్మలు తెల్లగా మారేలా చేస్తుంది. మెలనిన్ ఉత్పత్తి కణజాలాలను దెబ్బతీసే ధూమపానం ఆక్సిడెంట్ ప్రభావం వల్ల మెలనోసైట్స్ ఏర్పడతాయి.
కాబట్టి, ధూమపానం చేసేవారికి ముందుగా జుట్టు తెల్లబడుతుంది. జుట్టుకి సహజమైన రంగుని ఇవ్వడానికి కాఫీ హెల్ప్ అవుతుంది. కాబట్టి, కాఫీ పొడిని కనుబొమ్మలు నల్లగా చేసేందుకు హెల్ప్ చేస్తుంది. ఇందుకోసం ఏం చేయాలంటే ఒక కప్పు నీరు కాఫీ పొడి రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. 2 టీ స్పూన్ల కాఫీ పొడిని 2 టేబుల్ స్పూన్ల చల్లని నీటితో కలపాలి. తర్వాత దీన్ని వేడినీటిలో వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. మీరు ఈ పదార్థాన్ని కనుబొమ్మలకి అప్లై చేసి 20, 30 నిమిషాల తర్వాత నీటిని కడగాలి. జుట్టు అకాల నెరసిపోకుండా ఉండేందుకు గూస్బెర్రీని వాడతారు. కాబట్టి, మీరు కనుబొమ్మల్ని నల్లగా మారేందుకు ఉసిరిని వాడొచ్చు. ముందుగా ఉసిరిని కట్ చేసి చిన్న ముక్కలుగా చేయాలి. వేడినీటిలో వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఆ నీటిని ఫిల్టర్ చేసి జుట్టుకి వాడొచ్చు. ఉసిరి రసం తాగడం వల్ల జుట్టు నెరవడాన్ని కూడా తగ్గించొచ్చు.