Multani Mitti: ముల్తానీ మట్టిని ప్రతీ రోజు ముఖానికి ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ముల్తానీ మట్టిని ప్రతి రోజు ఉపయోగించవచ్చా, రోజు ముఖానికి అప్లై చేస్తే ఏం జరుగుతుంది. ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:03 PM, Mon - 28 April 25

ముల్తానీ మట్టి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముల్తానీ మట్టి అందానికి ఎంతో మేలు చేస్తుంది. ఇటీవల కాలంలో ముల్తానీ మట్టి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మార్కెట్లోకి కూడా ముల్తానీ మట్టితో తయారు చేసిన సోపులు పేస్ క్రీమ్లు ఇలా చాలా రకాల బ్యూటీ ప్రొడక్తులు అందుబాటులోకి వచ్చాయి. ముల్తానీ మట్టి అందానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. మరి ఎన్నో ప్రయోజనాలు కలిగిన ముల్తానీ మట్టిని ప్రతి రోజు ముఖానికి ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదా, ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముల్తానీ మట్టి ముఖాన్ని అందంగా కనిపించేలా చేయడానికి బాగా ఉపయోగపడుతుందట. నిజానికి ముల్తానీ మట్టి చాలా తక్కువ ధరకే స్టోర్లలో లభిస్తూ ఉంటుంది. దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ముఖం మీద మొటిమలను, బ్లాక్ హెడ్స్ తొలగిస్తుందట. ముఖాన్ని ఎప్పుడూ అందంగా ఉంచడానికి సహాయపడుతుందట. ముఖానికి రోజూ ముల్తానీ మిట్టిని ఉపయోగించడం వల్ల ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు వస్తాయట? అలాగే ముల్తానీ మట్టిని ఉపయోగించడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయట. మీరు ముల్తానీ మట్టిని కొనేటప్పుడు మీ చర్మ రకాన్ని బట్టి ఎంచుకోవాలట. లేకపోతే మీ చర్మం వాపు, ఎరుపు, దద్దుర్లు వంటి సమస్యల బారినపడుతుందట. అలాగే ముల్తానీ మట్టిని సరిగ్గా వాడకపోవడం వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడి ముఖం అంద విహీనంగా కనిపిస్తుందట.
కాబట్టి సరైన ముల్తానీ మట్టిని కొని సరైన పద్ధతిలో ఉపయోగించాలని చెబుతున్నారు. కాగా పొడి చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టిని ఉపయోగించకపోవడమే మంచిదట. ఎందుకంటే ముల్తానీ మట్టి చర్మంలో ఉండే సహజ నూనెలను గ్రహిస్తుంది. మీరు దీన్ని ఉపయోగించాలనుకుంటే ఎక్కువగా అస్సలు ఉపయోగించకూడదు. ముల్తానీ మట్టి కొందరికి అలర్జీని కూడా కలిగిస్తుందట. కాబట్టి మీరు ముల్తాని మటీని ఉపయోగించే ముందు, ప్యాచ్ టెస్ట్ చేసి ఉపయోగించడం మంచిది. ముల్తానీ మట్టిని ఉపయోగించిన తర్వాత మీరు ఎండలోకి అస్సలు వెళ్లకూడదట. ఎందుకంటే ఇది మీ చర్మంపై చెడు ప్రభావాన్ని చూపుతుందట. అలాగే ముల్తానీ మట్టిని నేరుగా మీ చర్మానికి అప్లై చేయకూడదు. దీనికి బదులుగా మీరు మట్టితో పాటు రోజ్ వాటర్ లేదా పెరుగును ఉపయోగించవచ్చట. ముల్తానీ మిట్టిని రోజూ వాడకూడదట. ఎందుకంటే ఇది మీ చర్మాన్ని పొడిబారేలా చేస్తుందట. రోజు రోజుకు మీ ముఖం గరుకుగా మారడం ప్రారంభమవుతుందట. అదేవిధంగా మీకు సున్నితమైన చర్మం ఉన్నట్టైతే మీరు ప్రతిరోజూ ముల్తానీ మట్టిని ఉపయోగించకుండా ఉండాలనీ చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ చర్మంపై చెడు ప్రభావాన్ని చూపుతుందట. మీరు ముల్తానీ మట్టిని ఉపయోగించాలనుకుంటే వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఉపయోగించాలనీ,తరచుగా ఉపయోగిస్తే చర్మం పొడిబారుతుందని చెబుతున్నారు.