Korean Beauty Tips: కొరియన్స్ అంత అందంగా మారాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే?
మామూలుగా మనం కొరియన్ అమ్మాయిలను చూస్తే వారికి ఫేస్ మీద ఎటువంటి పింపుల్స్ లేకుండా ముఖం అంతా కూడా ఎంతో సాఫ్ట్ గా తెల్లగా ఉంటుంది. కొన్ని కొన్
- By Nakshatra Published Date - 10:30 PM, Tue - 22 August 23
మామూలుగా మనం కొరియన్ అమ్మాయిలను చూస్తే వారికి ఫేస్ మీద ఎటువంటి పింపుల్స్ లేకుండా ముఖం అంతా కూడా ఎంతో సాఫ్ట్ గా తెల్లగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు కొరియన్స్ అమ్మాయిలను చూసి అమ్మాయిలే ఈర్ష పడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే వారికి ఎటువంటి మేకప్ లేకుండానే తెల్లగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ బ్యూటీ కి కారణం మేకప్ కాదు. కేవలం ప్రాపర్ స్కిన్ కేర్. కొరియన్ స్కిన్ కేర్ అనగానే అమ్మో వాటిని నమ్మొచ్చా లేదో దానికి చాలా సమయం పడుతుంది అనుకుంటారు. కానీ ఇది చాలా ఈజీ. ఫస్ట్ వీక్ కొంచెం టైమ్ పట్టచ్చు కానీ, ఆ తరువాత స్పీడ్ గా చేసుకుంటారు.
అయితే కొరియన్ అమ్మాయిలు ఉపయోగించే బ్యూటీ టిప్స్ లో కొన్ని పాటించడం వల్ల మనం కూడా వారిలాగే అందంగా తయారు కావచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో ఎనిమిది స్టెప్స్ ఉన్నాయి. వీటిలో డబల్ క్లెన్సింగ్ లేదు. మీకు కావాలనుకుంటే ఏదైనా మైల్డ్ క్లెన్సర్ ని వాడవచ్చు. నిద్ర లేచిన తరువాత నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. ఎలాంటి క్లెన్సర్లూ ఉపయోగించకూడదు. నీరు మీ స్కిన్ ని రిఫ్రెష్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. నీటితో ముఖం కడుక్కున్న తరువాత టోనర్ అప్లై చేయాలి ఈ టోనర్ ని కాటన్ బాల్ మీద వేసి అప్లై చెయ్యవచ్చు, లేదా మీ అరచేతులలో వేసుకుని అయినా అప్లై చెయ్యచ్చు.
టోనర్ మీ స్కిన్ పీహెచ్ లెవెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. తరవాత వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ స్కిన్ అబ్జార్బ్ చేసుకునేలాగా చేస్తుంది. అలాగే ఈ ఎస్సెన్స్ సీరం, టోనర్, మాయిశ్చరైజర్ కలిపిన మిశ్రమం. కొరియన్ స్కిన్ కేర్ లో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్. ఇది స్కిన్ ని నరిష్ చేస్తుంది. అరచేతిలో వేసుకుని ముఖానికి అద్దాలి. అలా అని వేళ్ళతో రుద్దకూడదు. అదేవిధంగా యాంపూల్స్ సీరం లాంటివే, కానీ వీటిలో యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి గ్లాస్ బాటిల్స్ తో డ్రాపర్ తో కలిపి లభిస్తాయి. డ్రాపర్ తో కొన్ని చుక్కలు మీ ముఖం మీద వేసి వేళ్ళతో నెమ్మదిగా అద్దాలి. మీ స్కిన్ కి సరిపోయే సీరం ని తీసుకొని ముడతలు, నల్ల మచ్చలు, డ్రై స్కిన్ వంటి సమస్యలని సీరం దూరం చేస్తుంది. అరచేతిలో వేసుకుని వేళ్ళతో నెమ్మదిగా ముఖమంతా అద్దాలి.
కంటి చుట్టూతా ఉండే స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటుంది. మామూలు ఫేస్ క్రీములూ, సీరంలూ అక్కడ పని చెయ్యవు. అందుకని ఐ క్రీం వాడాలి. కొంచెం ఐ క్రీం తీసుకుని మీ వేలి చివరలతో కంటి మొదలు నించి కంటి కొస వరకూ రాయాలి.. కంట్లోకి వెళ్ళకుండా జాగ్రత్తపడాలి. మీ స్కిన్ టైప్ ని బట్టి మాయిశ్చరైజర్ ని ఎంచుకోండి. మాయిశ్చరైజర్ వల్లే స్కిన్ కి గ్లో వస్తుంది. ముఖం మీద మెడ మీద మాయిశ్చరైజర్ ని మసాజ్ చేస్తున్నట్లుగా రాయండి. ఇక చివరిగా అప్లై చెయ్యాల్సింది సన్ స్క్రీన్. ఇది యూవీ రేస్ నించీ, సన్ టాన్ నించీ, ముడతల నించీ చర్మాన్ని ప్రొటెక్ట్ చెస్తుంది. కనీసం ఎస్పీఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ ని ఎంచుకోవాలి.
Related News
Buttermilk: వేసవిలో మజ్జిగతో మీ అందాన్ని రెట్టింపు.. ఎలా అంటే?
పాలు పాల పదార్థాలు అయిన పెరుగు, మజ్జిగ లాంటి వాటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. చాలామందికి అన్నం త