Vegetable Idli: సరికొత్తగా వెజిటేబుల్ ఇడ్లీ ఎప్పుడైనా ట్రై చేశారా?
మామూలుగా ఈరోజుల్లో చాలామంది ఉదయం అలాగే సాయంకాలం సమయంలో ఇడ్లీలు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగాలే
- By Anshu Published Date - 05:20 PM, Fri - 25 August 23

మామూలుగా ఈరోజుల్లో చాలామంది ఉదయం అలాగే సాయంకాలం సమయంలో ఇడ్లీలు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేని వారికి పేషెంట్లను ఎక్కువగా ఇడ్లీ పెట్టమని చెబుతూ ఉంటారు. ఆరోగ్యం బాగా ఉన్నవారు ఎప్పుడూ ఒకే రకమైన ఇల్లు కాకుండా కాస్త వెరైటీగా రాదు ఇడ్లీ జొన్న ఇడ్లీ కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కూడా వెజిటేబుల్ ఇడ్లీని ట్రై చేశారా. కాస్త వెరైటీగా నోరూరించే విధంగా ఉన్న ఈ వెజిటేబుల్ ఇడ్లీ ని ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వెజిటేబుల్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు:
బొంబాయి రవ్వ – 2 కప్పులు
సేమ్యా – 1 1/2 కప్పు
తురిమిన కేరట్ – 1 కప్పు
బీట్రూట్ – 1 కప్పు
పచ్చి మిర్చి – 4
పచ్చి బఠాణి – 1/2 కప్పు
పెరుగు – 3 కప్పులు
పోపు దినుసులు – సరిపడా
వంటసోడా – చిటికెడు
కొత్తిమీర – కొద్దిగా
కరివేపాకు – కొద్దిగా
ఉప్పు – తగినంత
వెజిటేబుల్ ఇడ్లీ తయారి విధానం:
ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టి కాస్త నెయ్యి లేదా నూనే గాని వేసి బొంబాయి రవ్వను, సేమ్యాను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరికాస్త నూనే వేసి అందులో పోపుదినుసులు వేయించుకోవాలి. అవి వేగిన తరువాత వాటిలో కొత్తిమీర కరివేపాకు వేసి ఆపై అందులో తురిమిన కేరట్, బీట్రూట్ ఇంకా ఉడికించి పెట్టుకున్న బఠాణి వేసి వాటిని 3 నిమిషాలు మగ్గనియ్యాలి. స్టవ్ ఆపి వాటినన్నిటిని పెరుగులో వేసి కలపాలి. అదే పెరుగులో వేయించి పెట్టుకున్న రవ్వ, సేమియాను కలిపి అందులో ఒక చిటికెడు వంటసోడా కలిపి గంట పాటు నాననివ్వాలి. ఇలా నానిన పిండిని ఇడ్లీ పాత్ర ప్లేటుల్లో వేసి 15 నిమిషాలు ఉడకనీయాలి. ఈ ఇడ్లీలని పల్లి చెట్నీ తో గాని, కొత్తిమీర చట్నీతో గాని కలిపి తింటే చాల టేస్టీ గా ఉంటాయి.