Vaseline: వాజిలిన్ జుట్టుకు రాయవచ్చా.. రాస్తే ఏం జరుగుతుందో తెలుసా?
స్త్రీలు ప్రతి ఒక్కరూ కూడా పొడవైన జుట్టు కోసం ఎన్నో రకాల చిట్కాలు హోమ్ రెమెడీస్ ని ఫాలో అవ్వడంతో పాటు మార్కెట్లో దొరికే కొన్ని రకాల రసాయనా
- By Anshu Published Date - 10:00 PM, Wed - 5 July 23

స్త్రీలు ప్రతి ఒక్కరూ కూడా పొడవైన జుట్టు కోసం ఎన్నో రకాల చిట్కాలు హోమ్ రెమెడీస్ ని ఫాలో అవ్వడంతో పాటు మార్కెట్లో దొరికే కొన్ని రకాల రసాయనాల ప్రొడక్ట్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వల్ల ఫలితం రాకపోగా హెయిర్ ఫాల్ జుట్టు ఎర్రగా మారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మాములుగా జుట్టు సమస్యలకు అనేక కారణాలు ఉన్నాయి. పొల్యూషన్, పోషకాహార లేమి, సరైన జీవన విధానం లేకపోవడం, ఒత్తిడి, సరిపడని షాంపూలు, నూనెలు రాయడం, ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే, దీనికి కారణాలు ఏంటో కనుక్కొని వాటిని పరిష్కరించడం జుట్టు సమస్యల పరిష్కారానికి ఓ మార్గంగా చెప్పొచ్చు.
ఈ విషయం గురించి కొందరు సౌందర్య నిపుణులు స్పందించారు. పొడవాటి నల్లటి జుట్టు కోసం వాజిలిన్ రాయడం రాయడం వల్ల పొడవైన కేశాలను పొందొచ్చట. ఈ విషయం గురించి ఇప్పుడు మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. అయితే చలికాలం రాగానే చాలా మంది వాజిలెన్‌ని తమ డెయిలీ రొటీన్‌లో చేర్చుకుంటారు. దీని వల్ల తమ చర్మ సమస్యలను దూరం చేసుకుంటారు. అయితే వాజిలిన్ అనేది కేవలం చర్మ సమస్యలను మాత్రమే కాదండోయ్. దీని వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయట. వాజిలిన్ లో చర్మ, కేశ సమస్యలకు మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి.
వాజిలిన్‌లో మంచి మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఉంటుంది.
దీని వల్ల చర్మ, కేశ సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయి. దీనికి కావాలసినవి వాసెలిన్, విటమిన్ ఈ క్యాప్సూల్, కొబ్బరి నూనె.. ఈ మూడు పదార్థాలన్నింటిని ఉపయోగించి కేశ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందుకు ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో వాసెలిన్, విటమిన్ ఈ క్యాప్సల్స్ , కొబ్బరినూనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని తల మాడుకి పెట్టుకుని వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే చాలా వరకూ సమస్య తగ్గుతుంది. ఈ ఆయిల్ రాసుకుని ఆ రోజంతా అలానే ఉంచి మరుసటి రోజు తలస్నానం చేయవచ్చు.