Beauty Tips: ముఖంపై ఒక్క వెంట్రుక కూడా ఉండకూడదు అనుకుంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే!
ముఖం మీద చిన్నపాటి వెంట్రుకలతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చట.
- By Anshu Published Date - 12:00 PM, Wed - 14 May 25

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆరోగ్యం విషయంలో అందం విషయంలో ఎన్నో రకరజాగ్రత్తలు పాటిస్తున్నారు. మరి ముఖ్యంగా అందంగా కనిపించడం కోసం ఎన్నెన్నో చిట్కాలను కూడా ఫాలో అవుతున్నారు. స్త్రీలు చాలా మంది అండర్ ఆర్మ్స్, ఫేస్ మీద చిన్న వెంట్రుకలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటి కారణంగా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు. వీటి వల్ల ఆడవారి ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. ముఖం పై వెంట్రుకలను తొలగించడానికి మార్కెట్ లో ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ చాలా మంది ఆడవారు ముఖంపై వెంట్రుకలను తొలగించేందుకు వ్యాక్సింగ్ లేదా షేవింగ్ చేస్తుంటారు. కానీ వీటివల్ల ముఖ చర్మం దెబ్బతింటుందట.
అయితే కొన్ని నేచురల్ పద్ధతులను ఫాలో అయ్యే ముఖం మీద వెంట్రుకలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖాన్ని శుభ్రంగా చేయడానికి, అందంగా కనిపించేలా చేయడానికి పసుపు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. అంతేకాదు ముఖంపై పెరుగుతున్న అవాంఛిత రోమాలను తొలగించడానికి కూడా పసుపు దివ్య ఔషదంలా పనిచేస్తుందట. పసుపు మన ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా సహాయపడుతుందట. అందుకే ముఖంపై ఉన్న వెంట్రుకలను పోగొట్టడానికి పసుపు ఫేస్ మాస్క్ లను ఎలా తయారుచేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించడానికి పసుపు, బొప్పాయి ఫేస్ ప్యాక్ బాగా సహాయపడుతుందట. ఈ ఫేస్ ప్యాక్ ముఖ తేమను పెంచడానికి కూడా సహాయపడుతుందట. ఈ పసుపు, బొప్పాయి ఫేస్ ప్యాక్ ను తయారుచేయడం చాలా ఈజీ. ఇందుకోసం బొప్పాయిని తొక్క తీసి మెత్తగా రుబ్బుకోవాలట. దీనిలో చిటికెడు పసుపు కలిపి ఫేస్ కు పెట్టుకోని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి పెట్టాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని మృదువుగా చేసి వెంట్రుకలను తొలగిస్తుందని చెబుతున్నారు..
అలాగే ముఖంపై వెంట్రుకలను తొలగించడానికి పసుపు శెనగపిండి ఫేస్ ప్యాక్ కూడా ఎంతో బాధ పనిచేస్తుందట. ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేయడానికి శెనగపిండిలో చిటికెడు పసుపును వేసి కలిపి దీనిలో అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ గంధం పేస్ట్ ను కూడా వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే ముఖంపై ఉన్న వెంట్రుకల తొలగిపోతాయట. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖంపై ఉండే వెంట్రుకలను తొలగించడం వల్ల కలిగే చర్మం ఎరుపు, వాపును తగ్గించడానికి సహాయపడుతుందట. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా కూడా చేస్తుందని చెబుతున్నారు.