Tomoto Keema Balls: ఎంతో స్పైసిగా ఉండే టమోటా కీమా బాల్స్.. తయారు చేయండిలా?
చాలామంది బయట దొరికే స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్స్ కంటే ఇంట్లోనే కొత్త కొత్తగా తయారు చేసుకోవాలి. కొత్త వంటలు తినాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎలా
- By Anshu Published Date - 07:30 PM, Thu - 29 June 23

చాలామంది బయట దొరికే స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్స్ కంటే ఇంట్లోనే కొత్త కొత్తగా తయారు చేసుకోవాలి. కొత్త వంటలు తినాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎలాంటి వంటలు చేసుకోవాలి అందుకోసమే ఏమేమి కావాలి అన్న విషయం చాలామందికి తెలియదు. అయితే చాలామంది ఎక్కువ శాతం స్పైసీగా ఉండే ఫుడ్ ఐటమ్స్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలా ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో టొమాటో కీమా బాల్స్ కూడా ఒకటి. మరి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే టొమాటో కీమా బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టొమాటో కీమా బాల్స్ తయారీకి కావలసిన పదార్థాలు :
కీమా – పావు కిలో
టొమాటో – 3
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్
ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు
క్యారెట్, బీట్‌రూట్ తురుము – 1 టేబుల్ స్పూన్
మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం – 1 టీ స్పూన్
బ్రెడ్ స్లైసెస్ – 10 అంచులు కట్ చేసి చేయాలి
పాలు – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా టేబుల్ స్పూన్ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, బీట్‌రూట్ తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకుని మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కూడా వేసి బాగా కలిపాలి. కాసేపు మూతపెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఆ తరువాత ముందుగానే ఉడికించి పెట్టుకున్నా కీమా వేసుకుని, 2 నిమిషాల పాటు గరిటెతో బాగా కలిపి, టొమాటో జ్యూస్, నిమ్మరసం వేసుకుని దగ్గరపడేవరకూ చిన్న మంట మీద ఉంచాలి. అది కాస్త దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ప్రతి బ్రెడ్ స్లైస్‌ని పాలలో ముంచి, రెండు చేతుల మధ్య పెట్టి, పాలు లేకుండా గట్టిగా ఒత్తుకోవాలి. అందులో కొద్దికొద్దిగా కీమా మిశ్రమం పెట్టుకుని ఉండల్లా చేసుకోవాలి. అనంతరం నువ్వుల్లో ఆ బాల్స్‌ని వేసి వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కీమా బాల్స్ రెడీ.