Tomato Coriander Rice: టమాటా కొత్తిమీర రైస్.. ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోండిలా?
మామూలుగా మనం టమోటా ని ఎన్నో రకాల వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటాం. ప్రత్యేకించి టమోటాలతో టమోటా కర్రీ టమోటా రసం,టమోటా చట్నీ, టమోటా
- By Anshu Published Date - 08:15 PM, Wed - 13 December 23

మామూలుగా మనం టమోటా ని ఎన్నో రకాల వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటాం. ప్రత్యేకించి టమోటాలతో టమోటా కర్రీ టమోటా రసం,టమోటా చట్నీ, టమోటా రైస్ వంటి రెసిపీలను తయారు చేసుకొని తింటూ ఉంటాం. అలాగే కొత్తిమీరతో కూడా కొత్తిమీర రైస్ కొత్తిమీర చట్నీ వంటివి చేసుకొని తింటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా టమోటా కొత్తిమీర రైస్ తిన్నారా. ఎప్పుడు తినకపోతే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టమాటా కొత్తిమీర రైస్ కి కావాల్సిన పదార్థాలు:
నూనె – 2 టేబుల్ స్పూన్స్
దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క
లవంగాలు – 4
యాలకులు – 3
బిర్యానీ ఆకు – 1
జీలకర్ర – అర టీ స్పూన్
దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5
ఎండుమిర్చి – 2
పచ్చిమిర్చి – 3
చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర కట్ట – ఒకటి
పెద్ద టమాటాలు – 2
ఉప్పు – తగినంత
పసుపు – అర టీ స్పూన్
ధనియాల పొడి – ఒక టీ స్పూన్
అన్నం – 2 కప్పులు
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
టమాటా కొత్తిమీర రైస్ తయారీ విధానం:
ముందుగా కొత్తిమీరను పేస్టు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత మసాల దినుసులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవన్నీ వేగాక కొత్తిమీర పేస్టు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించుకుని టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. టమాట ముక్కలు మెత్తబడిన తర్వాత ధనియాల పొడి వేసుకుని కలపాలి. తర్వాత అన్నం వేసుకుని కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర రైస్ రెడీ.