Termites : చెదలుపట్టి సామాన్లు పాడైపోతున్నాయా ? ఈ టిప్స్ ట్రై చేయండి
చెదపురుగులను వదిలించుకునేందుకు తడి అట్టను ఉపయోగించుకోవచ్చు. నిజానికి ఈ వెట్ కార్డ్ బోర్డ్ లో సెల్యులోజ్ ఉంటుంది. ఇది చెదపురుగులను తరిమికొడుతుంది.
- By News Desk Published Date - 08:00 AM, Tue - 21 November 23

Termites : అసలే చలికాలం. గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఇది చెదపురుగులు సంతానోత్పత్తికి కారణమవుతాయి. ఇంట్లో తలుపులు, కిటికీలు, చెక్క బీరువాలు, పుస్తకాలు ఇతర సామాన్లకు చెదపురుగులు పట్టి.. పాడైపోతాయి. వాటిని వదిలించుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ మళ్లీ వస్తుంటాయి. అలాంటపుడు కొన్ని పద్ధతుల్ని పాటించడం ద్వారా చెదపురుగులను నియంత్రించవచ్చు. అవేంటో చూద్దాం.
చెదపురుగులను వదిలించుకునేందుకు తడి అట్టను ఉపయోగించుకోవచ్చు. నిజానికి ఈ వెట్ కార్డ్ బోర్డ్ లో సెల్యులోజ్ ఉంటుంది. ఇది చెదపురుగులను తరిమికొడుతుంది. చెదపురుగులు ఉన్న ప్రదేశంలో తడి కార్డ్ బోర్డ్ ను ఉంచితే.. కొంతకాలానికి అవి బయటకు వస్తాయి. ఆ కార్డ్ బోర్డ్ పైకి చెదలు వచ్చాక పురుగుల మందు పిచికారీ చేస్తే చెదపురుగులు పూర్తిగా తొలగిపోతాయి.
లవంగాలతో ఫర్నిచర్ కు పట్టిన చెదపురుగులను దూరం చేసుకోవచ్చు. ఒక కప్పునీటిలో 6 చుక్కల లవంగం నూనె ను కలిపి.. ఒక స్ప్రే బాటిల్ లో ఉంచి.. చెదపురుగులపై పిచికారీ చేయాలి. ఇది చెదపురుగులను చంపుతుంది. ఎక్కువగా ఉంటే.. వరుసగా 3-4 రోజుల పాటు ఈ స్ప్రే ను వాడవచ్చు.
ఒక కప్పు నీటిలో తొక్కతీసిన వెల్లుల్లి రెబ్బలు 6-8 వేసి.. అందులో వేపనూనె లేదా వేప ఆకులను వేయాలి. ఈ ద్రవాన్ని స్ప్రే ను చెదపురుగులపై చల్లితే త్వరగా పోతాయి.
అలోవెరా జెల్ కూడా చెదపురుగులను తొలగిస్తుంది. చెదలు తక్కువగా ఉన్నప్పుడు.. అవి ఉన్న ప్రాంతంలో కలబంద జెల్ ను రాస్తే క్రమంగా తొలగిపోతాయి. ఈ టిప్స్ ను పాటించడం ద్వారా చెదపురుగుల్ని వదిలించుకోవచ్చు.