Grow Thick Eyebrows: కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే ?
ముఖం అందంగా కనిపించాలి అంటే కనుబొమ్మలు అందంగా చక్కగా ఉండడం చాలా ముఖ్యం. కనుబొమ్మలు నల్లగా ఒత్తుగా ఉన్నప్పుడే ముఖం మరింత అంద
- By Anshu Published Date - 04:30 PM, Sat - 9 December 23

ముఖం అందంగా కనిపించాలి అంటే కనుబొమ్మలు అందంగా చక్కగా ఉండడం చాలా ముఖ్యం. కనుబొమ్మలు నల్లగా ఒత్తుగా ఉన్నప్పుడే ముఖం మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది ఈ కనుబొమ్మలు సరిగా లేక ఏవేవో చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమందికి కనుబొమ్మలు పలుచగా ఉంటాయి. మరికొందరికి చాలా దట్టంగా ఉంటాయి. కనుబొమ్మలు ఎక్కువగా ఉన్నా పర్లేదు కానీ తక్కువగా ఉంటే మాత్రం ముఖం అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. మరి కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలి అంటే అందుకోసం ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇందుకోసం ఆముదం ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ఒత్తుగా ఉండే కనుబొమ్మలు కావాలి అంటే ప్రతిరోజు కాస్త ఆముదాన్ని నిద్రపోయే ముందు కనుబొమ్మల చుట్టూ అప్లై చేయాలి.. ఇలా ప్రతిరోజూ చేస్తూ ఉండటం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా నల్లగా పెరుగుతాయి. అదేవిధంగా రాత్రి సమయంలో నానబెట్టిన మెంతుల్ని ఉదయాన్నే పేస్ట్ చేసి కనుబొమ్మలపై అప్లై చేయడం వల్ల ఒత్తైన కనుబొమ్మలను మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ తాజా ఉల్లి రసానికి కొన్ని నిమ్మ చుక్కలు కలపాలి. తర్వాత దానిని దూదితో కనుబొమ్మల ప్రాంతంలో రాసి కొద్దిసేపు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.
కను బొమ్మలు ఒత్తుగా పెరగడానికి కలబంద కూడా సహకరిస్తుంది. అలోవెరా చెక్కు తీసి నేరుగా కనుబొమలను రుద్ది, ఆరనిచ్చి కడిగినా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే కొబ్బరి నూనె తరచూ అప్లై చేయడం వల్ల కూడా కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. అదే విధంగా పాలల్లో ముంచిన దూదితో కనుబొమలపై అద్దండి. 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేయండి. పాలలో తేనె యాడ్ చేసి అప్లై చేసినా మంచి రిజల్ట్స్ ఉంటాయి.విటమిన్ లోపం వల్ల కూడా వెంట్రుకల ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి ‘బి’, ‘సి’, ‘ఇ’ వంటి విటమిన్లు అధికంగా లభించే ఆహార పదార్థాలను రోజూ తీసుకోవాలి.