HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Life Style
  • >Teenage Love And Romantic Relationships How Indian Parents Can Deal With It

Teenage Relationship: పిల్లలు చిన్న వయసులోనే ప్రేమలో పడ్డారా? ఈ విషయం తెలిశాక తల్లిదండ్రులు ఏం చేయాలి?

కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులో ఒక టీనేజీ అమ్మాయి , బాయ్ ఫ్రెండ్ తో కలిసి తన తండ్రిని హత్య చేసింది.

  • By Hashtag U Published Date - 07:15 AM, Thu - 1 September 22
  • daily-hunt
Teenage Relationship
Teenage Relationship

కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులో ఒక టీనేజీ అమ్మాయి , బాయ్ ఫ్రెండ్ తో కలిసి తన తండ్రిని హత్య చేసింది.

ఎందుకు ఇలా చేసింది ? అని పోలీసులు దర్యాప్తు చేస్తే నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగు చూశాయి.

బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుగుతున్నావ్ ఎందుకు ? అని ఆ యువతిని తండ్రి ప్రశ్నించాడు. అలాగే తిరుగుతాను అని కూతురు బదులివ్వడంతో చితకబాదాడు. సెల్ ఫోన్ కూడా లాక్కున్నాడు. చాలా రోజులు ఇంట్లోనే ఉంచాడు. దీన్ని మనసులో దాచుకున్న ఆ యువతి బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒక స్కెచ్ గీసి కన్న తండ్రినే మట్టుబెట్టింది.

ఇంకెన్నో చోట్ల ప్రేమకు పేరెంట్స్ నో చెప్పగానే టీనేజీ లవర్స్ ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ ఎలా స్పందించాలి ?

పిల్లలకు ఎలా నచ్చ చెప్పాలి ?

అది ప్రేమ కాదు.. వ్యామోహం అని అర్ధమయ్యేలా ఎలా వివరించాలి?

పిల్లలు చెప్పగానే..

“నేను ఆ అమ్మాయి/అబ్బాయితో ప్రేమలో పడ్డాను” అని పిల్లలు చెప్పగానే తల్లితండ్రుల గుండె గుభేలుమంటుంది. ఆ మాట తమ పిల్లల నోట ఎప్పటికీ వినిపించకూడదని ప్రతి తల్లితండ్రులూ కోరుకుంటారు. అసలు ప్రేమ అనే భావనే తప్పనే ఉద్దేశంతో పిల్లల పెంపకం సాగాలని దృఢంగా నమ్ముతారు. కానీ ఎన్ని అనుకున్నా, ఎంత చెప్పినా ఒక సమయానికి పిల్లలు ప్రేమలో పడడం అత్యంత సహజం. ఆ విషయం తెలిసినప్పుడు తల్లితండ్రులు ఎలా స్పందించాలనే దానిపై మానసిక నిపుణుల సూచనలివి..

 ఇలా చేయొద్దు!

* కోప్పడకూడదు, ప్రేమించిన వ్యక్తిని దూషించకూడదు.

* ఆవేశం తెచ్చుకుని కూతురు/కొడుకు మీద దాడికి దిగకూడదు.

* ఉన్నపళాన ‘మాకు ఇష్టం లేదు’ అనికానీ, ‘సరే!’ అనికానీ అభిప్రాయం చెప్పేయకూడదు. ఆ సందర్భంలో ఆవేశం స్థానంలో లాజిక్‌ పని చేయాలి.

* బంధువులందరినీ పిలిచి, విషయాన్ని వారి మధ్యలో పెట్టి, సలహాలు అడగకూడదు.

* అప్పటిదాకా చూపించిన ప్రేమలో మార్పు చూపించకూడదు.

* ఇంట్లో బంధించడం, స్వేచ్ఛను కుదించడం చేయకూడదు.

* స్నేహితుల్ని ఆరా తీయడం, ఫోన్‌ చెక్‌ చేయడం, గూఢచారుల్ని ఏర్పాటు చేయడం లాంటివి చేయకూడదు. ఇలా చేస్తే పిల్లల మనసు విరిగిపోతుంది.

ఇలా చేయండి!

* మొదట పిల్లలు ఏం చెప్పదలుచుకున్నారో పూర్తిగా చెప్పనివ్వాలి.

* ఎందుకు ప్రేమించారు, ఎటువంటి పరిస్థితుల్లో ప్రేమించారు, ఎవర్ని ప్రేమించారు, ఏం ఆశించి ప్రేమించారు అనేది తెలుసుకోండి.

* విన్న తర్వాత ఆదరాబాదరాగా తేల్చే వ్యవహారం కాదనీ, ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చెప్పండి.

* ‘ఆలోచిద్దాం’ అనే మాట ఒప్పుకోలు కాదు. ఆశించినట్టు జరగవచ్చు, జరగకపోవచ్చు అనే అర్థం పిల్లలు గ్రహించేలా ఉండాలి. ఆలోచిద్దాం! అంటే….నీ నిర్ణయానికి ఒప్పుకుంటున్నాం అని అర్థం కాదు. అయితే ప్రేమించడానికి కారణాలను విశ్లేషించుకుని వివరణలతో మమ్మల్ని నమ్మించగలగాలి, అప్పటివరకూ చదువు మీద దృష్టి పెట్టాలని పిల్లలతో చెప్పాలి.

* బ్లాక్‌మెయిలింగ్‌ ప్రేమ పిల్లలకు నచ్చదు. ‘మా ప్రేమ కాదని వేరొకర్ని ఎంచుకుంటే మేం నీతో ప్రేమగా ఉండలేం’ అన్నట్టు కాకుండా, పూర్వం ఉన్నట్టుగానే ప్రేమతో మెలగాలి.

* ‘నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నా తల్లితండ్రులుగా నీ వెంట మేము ఉంటాం! అయితే నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల మేం అంతర్గతంగా బాధపడతాం!’ అనే విషయం పిల్లలు గ్రహించేలా మసలుకోవాలి. నమ్మకం, ప్రేమలతోనే పిల్లల మనసులను గెలవగలం. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని పిల్లలతో మెలగాలి.

* ప్రేమ అనే మాట వినగానే హృదయంలో గిలిగింతలు మొదలవుతాయి. ప్రేమలో పడితే ఈ ప్రపంచమంతా మీ గుప్పిట్లో ఉన్నట్లు అనిపిస్తుంది.

* ప్రేమ భావనను వ్యక్తీకరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే మీరు ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు మీ మనస్సులో ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?

* అసలు మీరు ప్రేమలో పడ్డారా, లేదంటే ఆ భావనంతా మీలో కలిగే కోరికల ప్రభావమా? ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న.

* సరే ఇవన్నీ కాదు..ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?

ప్రేమ.. 3 కోణాలు

* రొమాంటిక్‌ లవ్ లో మూడు ప్రధానమైన అంశాలు ఉంటాయి. వీటిలో మొదటిది కామం..కామం అనేది ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్‌ల వంటి హార్మోన్లు చూపించే ప్రభావం. ఇవి మీ లైంగిక సామర్థ్యాన్ని, కోరికను ప్రభావితం చేస్తాయి. ఇది పూర్తిగా భౌతికమైన అంశం.

* రొమాంటిక్ లవ్‌లో రెండో కోణం ఆకర్షణ.ఇది డోపమీన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్ ద్వారా ప్రభావితమవుతుంది.ఇది మన మెదడులో విడుదలయ్యే జీవ రసాయనం.ఏదో ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలని మనల్ని ప్రేరేపిస్తుంది. పైగా అదే పనిని పదే పదే చేయాల్సిందిగా కూడా చెబుతుంటుంది.

* రొమాంటిక్ లవ్‌కు సంబంధించిన మూడో అంశం “వ్యసనం”.ఇలాంటి ఆలోచనలు ఉన్నవారిలో తార్కికంగా ఆలోచించే శక్తిని, సరైన ప్రవర్తనను నియంత్రించే మెదడులోని భాగాన్ని డోపమీన్ నిరుత్సాహపరుస్తుంది.ప్రజలు ఇలాంటి అశాస్త్రీయమైన భావనలో కనీసం 18 నెలల వరకు ఉండగలరు.మరొక హార్మోన్ కూడా ఆకర్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని పేరు నోరపినఫ్రిన్.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • indian parents
  • Relationship
  • teenage love

Related News

    Latest News

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd