Vankaya Bonda: వంకాయ బోండా ఇలా తయారు చేస్తే చాలు.. లొట్టలు వేసుకుని తినేయాల్సిందే?
సాయంకాలం సమయంలో టీ తాగేటప్పుడు అలా ఏదైనా విడివిడిగా స్నాక్స్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్పైసీగా తినాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు.
- By Anshu Published Date - 07:40 PM, Thu - 22 June 23

సాయంకాలం సమయంలో టీ తాగేటప్పుడు అలా ఏదైనా విడివిడిగా స్నాక్స్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్పైసీగా తినాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. స్నాక్స్ అనగానే టీ లేదా సమోసా టీ లేదంటే బజ్జీలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎప్పుడు మిరపకాయ బజ్జీనే కాకుండా అప్పుడప్పుడు కాస్త కొత్తగా ట్రై చేయడం మంచిది. మరి సాయంకాలం సమయంలో వంకాయ బోండా తినాలి అనుకుంటున్నారా. అయితే ఇలా ట్రై చేయాల్సిందే.వంకాయ బోండా తయారీకి కావలసినవి పదార్థాలు ఇవే..
వంకాయలు – 10
ఉల్లిపాయ – 1
నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర – అర టీ స్పూన్
నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు
కారం – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
శనగపిండి – 1 కప్పు
బియ్యప్పిండి – పావు కప్పు
వాము – అర టీ స్పూన్
పసుపు – చిటికెడు
తినే సోడా – కొద్దిగా
నీళ్లు – సరిపడా
నూనె – డీప్ ఫ్రైకి సరిపడినంత
తయారీ విధానం: ముందుగా నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నిమ్మరసం, అర టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆపై ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యప్పిండి, వాము, పసుపు, అర టీ స్పూన్ కారం, తినే సోడా, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలపాలి.
కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందే కాస్త వేయించి పెట్టుకున్న వంకాయల్లో ఉల్లిపాయ మిశ్రమం పెట్టుకుని వాటిని శనగపిండి మిశ్రమంలో బాగా ముంచి నూనెలో దోరగా వేయించుకోవాలి.
వేడి వేడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, టొమాటో కచప్ వంటివి జోడించి తింటే భలే రుచిగా ఉంటాయి ఈ వంకాయ బోండాలు.