Sweet Rice With Coconut Milk: ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలు స్వీట్ రైస్.. ఇలా చేస్తే చేస్తే ప్లేట్ ఖాళీ?
మామూలుగా మనం కొబ్బరి పాలను ఎన్నో రకాల స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే కొన్ని రకాల వంటల్లో కూడా కొబ్బరి పాలను వినియోగిస్తూ ఉంటా
- By Anshu Published Date - 08:25 PM, Tue - 19 March 24

మామూలుగా మనం కొబ్బరి పాలను ఎన్నో రకాల స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే కొన్ని రకాల వంటల్లో కూడా కొబ్బరి పాలను వినియోగిస్తూ ఉంటాము. అయితే ఎప్పుడైనా కొబ్బరి పాలతో తయారు చేసిన స్వీట్ రైస్ ని తిన్నారా. ఈ రెసిపీ పేరు చెబితేనే నోరు ఊరుతుంది కదూ. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏమేం కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
కావాల్సిన పదార్థాలు:
బియ్యం – పావు కిలో
పంచదార – వంద గ్రాములు
కొబ్బరి పాలు – 200 మి.లీ
పాలు – 100 మి.లీ
కుంకుమ పూవు – రెండు రేకులు
కొబ్బరి క్రీమ్ – ఒక స్పూను
డ్రైఫ్రూట్స్ – గుప్పెడు
నెయ్యి – రెండు స్పూనులు
తయారీ విధానం :
ముందుగా బియ్యాన్ని కాస్త నీళ్లు, కొబ్బరి పాలు వేసి సగం వరకు ఉడికించాలి. సగం బియ్యం ఉడికాక పాలు, పంచదార, కుంకుమపూల రేకులు కూడా వేసి ఉడికించాలి. చక్కని రంగు కోసం కుంకుమ పూల రేకులు జత చేరుస్తాము. అన్నం పూర్తిగా ఉడికాక పై కొబ్బరి క్రీమ్ తో గార్నిష్ చేయాలి. డ్రైఫ్రూట్స్ ను నెయ్యిలో వేయించి పైన గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరిపాల స్వీట్ రైస్ రెడీ.