Mung Bean: పెసరపప్పుతో ఇలా చేస్తే చాలు మొటిమలు తగ్గడంతో పాటు?
ఈ రోజుల్లో చాలామంది స్త్రీ పురుషులు మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఈ మొటిమలు ఎక్కువ అవ్వడం వల్
- By Nakshatra Published Date - 09:45 PM, Wed - 23 August 23
ఈ రోజుల్లో చాలామంది స్త్రీ పురుషులు మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఈ మొటిమలు ఎక్కువ అవ్వడం వల్ల ముఖం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మొటిమలు తగ్గించుకోవడానికి మార్కెట్ లో దొరికే రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లు హోమ్ రెమెడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే మన వంటింట్లో దొరికే పెసరపప్పుతో మొటిమలు తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఫేస్ ప్యాక్.. పెసలతో చేసే ఫేస్ పాక్ డ్రై స్కిన్ వారికి మాజిక్ లాగా పనిచేస్తుంది. ఒక గుప్పెడు పెసలని రాత్రంతా పచ్చిపాలలో నానబెట్టి, పొద్దున్న వాటిని మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ముఖం శుభ్రంగా కడుక్కున్న తరువాత ఈ పేస్ట్ అప్లై చెసి పదిహేను లేదా ఇరవై నిమిషాల పాటూ అలాగే ఉంచి ఆరిపోయిన తరవాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకున్నాక మెత్తటి బట్టతో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారౌతుంది. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖం కూడా నిగారిస్తూ అందంగా మారుతుంది. చాలా మంది మొటిమలతో బాధపడుతుంటారు. మొటిమలతో, యాక్నే తోటీ విసుగెత్తిన వారందరూ ఒక్కసారి పెసలు వాడడం వల్ల మంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
గుప్పెడు పెసలని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్న వాటిని మెత్తగా రుబ్బి అందులో కొంచెంగా నెయ్యి కలిపి ముఖానికి అప్లై చేసి, ముఖాన్ని నెమ్మదిగా మసాజ్ చేస్తూ పది నిమిషాలు ఉంచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడిగి మెత్తటి బట్టతో క్లీన్ చేయాలి. వారానికి ఇలా మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అదేవిధంగా జుట్టు ఊడిపోతున్నా, డ్రై అయిపోతున్నా జుట్టు డల్ గా ఉన్న పెసలతో చేసే హెయిర్ పాక్ బాగా పనిచేస్తుంది. కాబట్టి కొన్ని పెసల్ని ఉడకబెట్టి రుబ్బా లి. ఇందులో గుడ్డు పచ్చసొన, కొంచెం నిమ్మరసం, పెరుగూ వేసి కలిపి, ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి పదిహేను నిమిషాలు ఉంచాలి. మైల్డ్ షాంపూతో తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలని ఈ ప్యాక్ పోగొడుతుంది.
Related News
Mung Bean: పెసరపప్పుతో మొటిమలు తగ్గుతాయా.. ఇందులో నిజమెంత!
పెసరపప్పు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పెసరపప్పును ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా చేస్తూ ఉంటారు. పెసరపప్పు అనగానే చాలామందికి మొలకెత్తిన పెసలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం మంది మొలకెత్తిన పెసలను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకొందరు పెసర బ్యాల్ల పాయసం పెసర బ్యాల్ల పప్పు అంటూ రకరకాల రెసిపీలు తయారు చేసుకుని తింటూ ఉంటారు.చాలా�