Sugar Cane: మొటిమలు మచ్చలు మాయం అవ్వాలి అంటే చెరుకు రసంతో ఈ విధంగా చేయాల్సిందే!
మొటిమలు మచ్చల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు చెరుకు రసంతో కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చట.
- By Anshu Published Date - 10:00 AM, Sun - 12 January 25

చెరుకు రసం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చెరుకు రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో ఎక్కడ చూసినా కూడా ఈ చెరుకు రసం బండ్లు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ చెరుకు రసం తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంచెం ఐస్ వేసుకొని అందులో అల్లం పుదీనా వేసుకొని తాగితే ఆ మజానే వేరు. ఈ చెరుకు రసం కూడా ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. రుచితో పాటు ఎన్నో పోషకాలు నిండి ఉంటుంది. మీకు తెలుసా చెరుకు రసం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కేశ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.
ముఖ్యంగా మొటిమలు మచ్చలు వంటి సమస్యలను చెరుకు రసం ఉపయోగించి తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. మరి చెరుకు రసంతో వాటిని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చెరుకు రసంలో కొంచెం ముల్తానీ మట్టి కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి పట్టిస్తే ముఖంపై ఉండే నల్లటి మచ్చలు తొలగిపోతాయట. అదేవిధంగా చెరుకు రసంలో కొద్దిగా తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని పావుగంట పాటు చర్మానికి మర్దన చేసి ఆ తర్వాత 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలట. ఆపై నీటితో ముఖాన్ని శబ్దం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం వృద్ధువుగా మారుతుందట. ఇలా వారానికి కనీసం రెండుసార్లు అయినా చేయాలని చెబుతున్నారు. అలాగే చెరుకు రసంలో కొంచెం కాఫీ పౌడర్ కలిపి ముఖానికి అప్లై చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుందట.
చెరుకు రసంలో నిమ్మరసం,యాపిల్ జ్యూస్, ద్రాక్షరసం,కొబ్బరిపాలు వీటన్నింటినీ సమపాళ్లలో తీసుకొని బాగా కలిపి చర్మానికి అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల చర్మంపై ఉండే మొటిమలు మచ్చలు తొలగిపోయి మెరుపు వస్తుందని చెబుతున్నారు. చర్మం బిగుతుగా యవ్వనంగా మారడం కోసం చెరుకు రసంతో తయారుచేసిన ఐస్ క్యూబ్ లను వాడితే రెట్టింపు ఫలితాలు కనిపిస్తాయట. అలాగే చెరుకు రసంలో కొంచెం బొప్పాయి గుజ్జు కలిపి చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం బిగుతుగా మారి యవ్వనంగా కనిపిస్తారని చెబుతున్నారు. నాలుగు చెంచాల చెరుకు రసంలో రెండు చెంచాల నెయ్యి కలిపి చర్మానికి బాగా మర్దన చేసి ఆపై శుభ్రం చేసుకోవడం వల్ల ఎందువల్ల కమిలిన చర్మం కొత్త నిగారింపును సంతరించుకుంటుందని చెబుతున్నారు.