Ginger Chicken: రెస్టారెంట్ స్టైల్ జింజర్ చికెన్.. తయారీ విధానం?
మామూలుగా మాంసాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడే వంటలలో చికెన్ కూడా ఒకటి. చికెన్ తో చేసిన అనేక రకాల వంటకాలను ఎంతో ఇష్టపడి తింట
- By Nakshatra Published Date - 08:30 PM, Thu - 31 August 23
మామూలుగా మాంసాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడే వంటలలో చికెన్ కూడా ఒకటి. చికెన్ తో చేసిన అనేక రకాల వంటకాలను ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. చికెన్ బిర్యానీ,చికెన్ కబాబ్, చికెన్ రోల్స్ అంటూ రకరకాల రెసిపీలను తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా సింపుల్గా ఈజీగా ఉండే జింజర్ చికెన్ తయారు చేసారా. ఒకవేళ తినకపోతే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
జింజర్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్ధాలు:
చికెన్ – 1 కిలో
అల్లం పేస్ట్- తగినంత
పచ్చిమిర్చి పేస్ట్
ఉల్లిపాయ – 2
వెల్లుల్లి పేస్ట్ – సరిపడా
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ – 2
పసుపు – 1/2 టీస్పూన్
ధనియాల పొడి – 2 టీస్పూన్లు
కరివేపాకులు – రెమ్మలు
ముందుగా చికెన్ ను మ్యారినేట్ చేయాలి. అందుకు మిక్సీ గిన్నె తీసుకుని తరిగిన అల్లం వేసుకుని మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. అనంతరం దానిని పక్కకి తీసుకుని ఒక పది పచ్చిమిర్చిని వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టాలి. అనంతరం ఉల్లిపాయలు 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పేస్ట్ చేసుకుని దీనిని కూడా పక్కకు పెట్టుకోవాలి. అనంతరం ఒక కిలో బోన్ ఉన్న చికెన్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని అందులో మెత్తటి అల్లంపేస్ట్ , పచ్చి మిర్చి పేస్ట్, ఉల్లి వెల్లుల్లి పేస్ట్ తో పాటు టీ స్పున్ ఉప్పు వేసుకుని చికెన్ ముక్కలు బాగా పట్టేలా చేసుకుని ఈ చికెన్ మిశ్రమాన్ని పక్కకు పెట్టాలి. అలా ఒక గంట పాటు ఈ చికెన్ ను నానబెట్టుకోవాలి. అనంతరం ఒక పాన్ తీసుకుని నూనె వేసుకుని ఇప్పుడు చికెన్ ను తీసుకుని అందులో వేసుకుని ఎర్రగా వచ్చేలా వేయించుకోవాలి. తర్వాత ఈ చికెన్ ను పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ నూనె వేసుకుని అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కమ్మటి స్మెల్ వచ్చే వరకూ వేయించుకుని అనంతరం అందులో టమాటా ప్యూరీ ని వేసుకోవాలి. ఒక 3 నిముషాలు వేయించి.. అనంతరం పసుపు, రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకుని బాగా కలపాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అనంతరం ఇంతకముందు రెడీ చేసుకున్న చికెన్ వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. అనంతరం తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత స్విమ్ లో పెట్టుకుని చికెన్ ను కదుపుతూ ఉండాలి. లాస్ట్ కు చికెన్ దగ్గరకు ఉడుకుతుంది. చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, నిలువగా తగిన పచ్చిమిర్చి, వేయించిన జీడిపప్పు , తగిన కొత్తిమీర , పొడవుగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుని.. బాగా కలిపాలి. అంతే రెస్టారెంట్ స్టైల్ లో టేస్టీ టేస్టీ స్పైసీ జింజర్ చికెన్ రెడీ. .
Related News
Chicken: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు
Chicken: మార్కెట్ లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గడంపై నాన్వెజ్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్రంలో కోళ్ళ లభ్యత పెరగడమే ధరలు తగ్గుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు ముదిరితే కోళ్ళు మృత్యువాత పడతాయని అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.నెల్లూరు బర్ట్ పూర్తి ప్ర�