Sorakaya Pappu: సొరకాయ పప్పు.. తయారీ విధానం ఇదే?
మామూలుగా మనం సొరకాయతో సొరకాయ వేపుడు, సొరకాయ కర్రీ, సొరకాయ పచ్చడి, సొరకాయ వడలు అంటూ రకరకాల వంటలు తయారు చేసుకుని తిం
- By Anshu Published Date - 08:30 PM, Sun - 27 August 23

మామూలుగా మనం సొరకాయతో సొరకాయ వేపుడు, సొరకాయ కర్రీ, సొరకాయ పచ్చడి, సొరకాయ వడలు అంటూ రకరకాల వంటలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే సొరకాయతో ఎప్పుడైనా పప్పు చేశారా. సొరకాయ పప్పు ఎంతో టేస్టీగా ఉండడంతో పాటు అన్నం చపాతి పూరి లాంటి వాటిలోకి ఎంతో బాగుంటుంది. మరి సొరకాయ పప్పు ఏ విధంగా చేసుకోవాలి అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సొరకాయ పప్పుకు కావాల్సిన పదార్ధాలు:
సొరకాయ ముక్కలు – మూడు కప్పులు
టమాటో ముక్కలు – ఒక కప్పు
ఉల్లిపాయ తరుగు – అర కప్పు
నానబెట్టిన కంది పప్పు – ముప్పావు కప్పు
పసుపు – పావు టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – రెండు
నీళ్లు – మూడు కప్పులు
ఉప్పు – తగినంత
నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు – పావు కప్పు
నూనె – రెండు టేబుల్ స్పూన్స్
ఆవాలు – ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్
ఇంగువ – చిటికెడు
కరివేపాకు – రెండు రెబ్బలు
దంచిన వెల్లులి – రెండు రెబ్బలు
సొరకాయ పప్పు తయారీ విధానం:
ముందుగా కుక్కర్లో ఉప్పు నిమ్మరసం కొత్తిమీర తరుగు తప్ప మిగిలిన పదార్దాలు అన్నీ వేసి మూడు విజిల్స్ వచ్చే దాకా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. నూనె వేసి తాలింపు పదార్దాలు అన్నీవేసి ఎర్రగా వేపి పప్పులో కలుపుకోవాలి. తాలింపు కలుపుకున్న పప్పులో ఉప్పు నిమ్మరసం కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.