HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Skin Care Add These Superfoods In Your Diet To Get Rid Of Dark Circles

Beauty Tips: డార్క్ సర్కిల్స్ పూర్తిగా పోవాలంటే వీటిని తినాల్సిందే!

కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్యను తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 24-09-2024 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Beauty Tips
Beauty Tips

ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీ పురుషులు డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ డార్క్ సర్కిల్స్ సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లు ఉపయోగించడంతో పాటుగా బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. కొంతమంది హోమ్ రెమిడీలను ఫాలో అవుతూ ఉంటారు. అలాగే డార్క్ సర్కిల్స్ ను పోగొట్టడానికి ఖరీదైన వాటిని ఉపయోగించే వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాని వారు కూడా ఉన్నారు. నిజానికి కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్ ను వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే మీరు మీ ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవడం వల్ల కూడా ఈ చర్మ సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డార్క్ సర్కిల్స్ సమస్య పోవాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తినాలని చెబుతున్నారు. మరి ఎలాంటి పదార్థాలు తింటే డార్క్ సర్కిల్స్ సమస్యను తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే బాదం పప్పులు మన ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయట. దీనిలో చర్మాన్ని పోషించే లక్షణాలు ఉంటాయట. బాదం చర్మాన్ని తేమగా మార్చడానికి, డ్రైనెస్ ను తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. వీటిని తింటే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయని చెబుతున్నారు.

బ్లూబెర్రీస్ లో విటమిన్ సితో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను బలోపేతం చేస్తాయట. అలాగే డార్క్ సర్కిల్స్ ను పూర్తిగా తగ్గిస్తాయని, అంతేకాదు ఇవి వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేయడానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు. అదేవిధంగా సాల్మన్ ఫిష్ లో ఎక్కువ మొత్తంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వీటిలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయట. ఇవి మన కళ్ల చుట్టూ ఉన్న నలుపును తగ్గించడానికి సహాయపడతాయని ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుందని చెబుతున్నారు. బచ్చలికూరలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త నాళాలను మెరుగుపరచడానికి సహాయపడుతుందట. అలాగే డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది గాయాలను మాన్పుతుంది. అలాగే చర్మ రంగును మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.

కాగా పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిలో ఉండే కర్కుమిన్ ఒక శక్తివంతమైన శోథ నిరోధక సమ్మేళనం. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్, డార్క్ సర్కిల్స్ తగ్గుతాయట. పసుపుతో ఫేస్ మాస్క్ ను తయారు చేసుకుని కూడా వాడవచ్చు. ఇది మీ ముఖాన్ని అందంగా మారుస్తుందని చెబుతున్నారు. అవొకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయని చెబుతున్నారు. అలాగే చర్మం పొడి బారడాన్ని తగ్గిస్తాయి. దీనిలో ఉండే విటమిన్ కె డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beauty tips
  • dark circles
  • food
  • food items

Related News

Gismat Jail Mandi

Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి ప‌దార్థాలు, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపల

  • Food safety

    HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

Latest News

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd