Silver Price: భారీగా తగ్గనున్న వెండి ధరలు.. కిలో ఎంతో తెలుసా?
ఇటీవల కాలంలో వెండి ధరలు పెరగడమే చూస్తున్నాం. దానికి తోడు బంగారం ధరలు. అయితే వెండి కొనాలనుకునే వారికీ ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
- Author : Praveen Aluthuru
Date : 12-09-2023 - 7:14 IST
Published By : Hashtagu Telugu Desk
Silver Price: ఇటీవల కాలంలో వెండి ధరలు పెరగడమే చూస్తున్నాం. దానికి తోడు బంగారం ధరలు. అయితే వెండి కొనాలనుకునే వారికీ ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అతిత్వరలో వెండి ధరలు తగ్గనున్నాయి. త్వరలో కిలో వెండి ధర రూ. 85 వేల రేంజ్‌కు చేరుకుంటుందని నివేదిక తెలిపింది ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వెండి ధరలు లక్ష రూపాయలకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
2023 మొదటి నాలుగు నెలల్లో వెండి భారీగా క్షీణించింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం ఈ క్షీణత తర్వాత దేశీయ వెండి ధరలు వరుసగా పెరిగాయి. గత కొన్ని నెలల గణాంకాలను పరిశీలిస్తే గత నాలుగు నెలల్లో వెండి ధరలు మొత్తం 11 శాతం పెరిగాయి. రానున్న 12 నెలల్లో వెండి ధర రూ.85,000కు చేరవచ్చని నివేదిక అంచనా వేసింది. నివేదిక ప్రకారం వచ్చే మరో 12 నెలల్లో వెండి ధరలు రూ. 82,000 – రూ. 85,000 పరిధికి చేరుకోవచ్చని నివేదిక వెల్లడించింది. డాలర్ ఇండెక్స్ 99.60 నుండి 104కి భారీగా పెరగడంతో వెండి పెరుగుదల వెనుక భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయి.
Also Read: Mancherial Constituency : మంచిర్యాల క్యాండిడేట్ ని మార్చాలి.. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు..