Palak Panner: రెస్టారెంట్ స్టైల్ లో పాలక్ పన్నీర్ ఇంట్లోనే తయారు చేసుకోండిలా?
పాలక్ పన్నీర్.. ఈ రెసిపీని మనం ఎక్కువగా ఉత్తర భారతదేశంలో వింటూ ఉంటాం. అక్కడ ఈ వంటకం చాలా బాగా ప్రాచుర్యం పొందింది. పన్నీర్ పాలకూర తో తయారు
- By Nakshatra Published Date - 08:30 PM, Tue - 25 July 23
పాలక్ పన్నీర్.. ఈ రెసిపీని మనం ఎక్కువగా ఉత్తర భారతదేశంలో వింటూ ఉంటాం. అక్కడ ఈ వంటకం చాలా బాగా ప్రాచుర్యం పొందింది. పన్నీర్ పాలకూర తో తయారు చేసే ఈ రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే చాలా వరకు ఈ రెసిపీని మనం ఎక్కువగా బయటనే తింటూ ఉంటాం. చాలా తక్కువ మంది మాత్రమే ఈ పాలక్ పన్నీర్ రెసిపీ ని ఇంట్లో తయారు చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి రెస్టారెంట్లో చేసిన విధంగా అంత టేస్టీగా రాదు అని దిగులు చెందుతూ ఉంటారు. మరి రెస్టారెంట్ స్టైల్ లో పాలక్ పన్నీరు ఏ విధంగా తయారు చేసుకోవాలి? అందుకు కావలసిన పదార్థాలు ఏవి? తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పాలక్ పన్నీర్ రెసిపీకి కావాల్సినవి పదార్థాలు :
పాలకూర – ఒక కప్పు
వెన్న – 4 టేబుల్ స్పూన్లు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క – 1
ఏలకులు – 4
పెద్ద ఉల్లిపాయ – 2
పెద్ద టమోటాలు – 2
పచ్చిమిర్చి – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
మిరప పొడి – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి – 2 టేబుల్ స్పూన్లు
గరం మసాలా – 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
వెన్న – 200 గ్రా
ఫ్రెష్ క్రీమ్ – 1/2 కప్పు
మెంతులు – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పాలక్ పన్నీర్ తయారీ విధానం :
ముందుగా ఒక గిన్నెలో నీరు పోసి పాలకూర వేసి 2 నిమిషాలు ఉడికించాలి. నీళ్లు పోసి పాలకూరను బ్లెండర్లో వేసి బాగా రుబ్బుకోవాలి. తరువాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి, అందులో వెన్న వేసి కరిగించి జీలకర్ర, దాల్చిన చెక్క, ఏలకులు, వేసి వేగించాలి. తరువాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించాలి. తరువాత, ముక్కలు చేసిన టమోటాలు వేసి 5 నిమిషాలు ఉడికించాలి. తరువాత మిరపకాయ, జీలకర్ర, గరం మసాలా, కొత్తిమీర వేసి కొన్ని నిమిషాలు వేయించాలి.
ఇప్పుడు ముందుగా సిద్దం చేసుకున్న పాలకూర పేస్ట్ ను వేసి, బాగా కలపాలి, రుచికి సరిపడా ఉప్పు వేసి 10 నిమిషాలు తక్కువ వేడి మీద ఉడకబెట్టండి.
తరువాత పన్నీర్ ముక్కలు వేసి పన్నీర్‌ను 1-2 నిమిషాలు ఉడకబెట్టి, ఆపై ఎండిన మెంతి ఆకులు క్రష్ చేసి క్రీమ్ వేసి కలపాలి రెండు నిముషాల తర్వాత క్రిందికి దించేయాలి. అంతే రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ సిద్ధం.
Related News
Palak Paratha: టేస్టీగా ఉండే పాలక్ పరోటా.. తయారీ విధానం?
మామూలుగా రాత్రి సమయంలో అలాగే ఎప్పుడైనా ఏదైనా స్పైసీగా తినాలని అనుకునేవారు పరోటాలు చపాతీ పూరి వంటివి తింటూ ఉంటారు. ఇక వాటిలోకి కాంబి