Pet Dogs : పెట్ డాగ్స్ పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నేడు అనేక మంది ఇళ్లల్లో పెట్ డాగ్స్ ను పెంచుకోవడం సర్వసాధారణం అయిపోయింది. వాటిపై వారు చూపించే ప్రేమ,...
- By hashtagu Published Date - 07:45 AM, Wed - 9 November 22
నేడు అనేక మంది ఇళ్లల్లో పెట్ డాగ్స్ ను పెంచుకోవడం సర్వసాధారణం అయిపోయింది. వాటిపై వారు చూపించే ప్రేమ, మమకారం అనిర్వచనీయం. అలాంటి మీ పెట్ డాగ్ ఏదో కారణంగా అంధత్వానికి గురైతే….ఆ బాధ ఊహించలేం. హృదయం చలించిపోతుంది. అలాంటి సందర్భాల్లో కూడా మీ పెట్స్ ను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో పశువైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంధత్వంతో బాధపడుతున్న మీ పెట్స్ ఆ అంధత్వాన్ని ఎదుర్కోగలవు.
కుక్కలలో అంధత్వం అనేది సాధారణంగా వయసురీత్యాగానీ,వ్యాధి కారణంగా గానీ సంభవించవచ్చు. అటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఒక సవాలే. కానీ, ఇలాంటి కుక్కలను మిగతా వాటి కంటే కొంచెం ఎక్కువ కేర్ గా చూసుకోవాలి. వాటిపై మనం చూపే కొంచెం ప్రేమ, సంరక్షణ వాటి జీవితాల్ని సురక్షితం చేయగలవు.
మీ పెట్ ఇంట్లో స్వేచ్ఛగా సంచరించడానికి వీలుగా సురక్షితమైన స్థలాన్ని ఏర్పాటు చేయడం చాలా కీలకం. ఇవి వాటికి సంభవించే ప్రమాదాలనుంచి సంరక్షిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
మీ పెట్స్ కోసం మీరు మీ ఇంట్లో తీసుకోవాల్సిన కొన్ని సంరక్షణ చిట్కాలు:
1. మీ ఇంటిని బేబీ ప్రూఫింగ్ చేయాలి : మీకు పెంపుడు కుక్క ఉన్నట్లైతే మీ ఇంట్లో పసిపిల్లలు ఉన్నట్లే. పసిపిల్లలు ఉంటే మన ఇంటిని ఏ విధంగా బేబీ ప్రూఫింగ్ చేస్తామో బ్లైండ్ పెట్ ఉన్నా కూడా అలా చేయాల్సిందే. మీరు చేసే బేబీ ఫ్రూఫింగ్ మీ పెట్ ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుంది. బేబీ ఫ్రూఫింగ్ అంటే.. పదునైన మీ ఇంటి మూలలను మొత్తటి స్పాంజ్ లతో కప్పేయాలి. జారిపడే అవకాశం ఉండే మెట్ల వంటి ప్రదేశాలలో గేట్లను ఏర్పాటు చేయాలి. ప్రమాదకరమైన వస్తువులు, ఆయుధాలు మీ పెట్ సంచరించే ప్రదేశాల్లో ఉంచకుండా జాగ్రత్త వహించాలి. బేబీ ఫ్రూఫింగ్ ద్వారా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
2. మీ ఇంటి లేఅవుట్ లను తరచుగా మార్చకూడదు : ఇంట్లో ఫర్నిచర్ ను, వస్తువులను తరచుగా మార్చడం చేయకూడదు. మీ బ్లైండ్ పెట్ తన మనస్సులో ఒక మ్యాప్‌ను తయారు చేసుకుంటుంది. ఆ మ్యాప్ ఆధారంగా మీ పెట్ సంచరిస్తుంది. మీ ఇంటిలో మీరు చేసే చిన్న మార్పు కూడా వాటిని గందరగోళానికి గురి చేస్తుంది. కాబట్టి, లేఅవుట్లో ఆకస్మిక మార్పులు చేయకపోవడం ఉత్తమం.
3. మీ ఇంట్లో వస్తువులను ఒక క్రమపద్దతిలో ఉంచేలా చూసుకోవాలి : సాధారణంగా చాలా ఇళ్లలో వస్తువులను ఒక క్రమపద్దతిలో ఉంచకుండా చెల్లాచెదురుగా పడేస్తూ ఉంటారు. షూస్ ను ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం, వస్తువులను చెల్లాచెదురుగా పడేయటం చేస్తూ ఉంటారు. ఇలాంటి అలవాట్లను మానుకోవాలి. ఈ అలవాట్లు మీ పెట్ ను గందరగోళానికి గురిచేస్తాయి.
4. విభిన్నమైన ఫ్లోర్ తివాచీలు ఎంతగానో ఉపయోగపడతాయి : సాధారణంగా మనుషులలో మాదిరే బ్లైండ్ పెట్స్ లో కూడా ఒక ఇంద్రియం కోల్పోయినప్పుడు ఇతర ఇంద్రియాలు యాక్టివేట్ అవుతాయి. బ్లైండ్ పెట్ లలో వాటి పాదాలు మరింత సున్నితంగా తయారవుతాయి. పాదాల స్పర్శతోనే అవి ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నాయో గుర్తించగలుగుతాయి. వేర్వేరు గదులలో వేర్వేరు తివాచీలను ఉపయోగించడం వల్ల మీ పెట్ డాగ్ గదుల మధ్య తేడాను గుర్తించగలుగుతాయి. ఇవి వాటికి ఎంతగానో సహాయపడతాయి.
5. శబ్దాల సందేశాలు ఎంతగానో సహాయపడతాయి : ఇంట్లోని నిర్ణీత ప్రదేశంలో రేడియో లేదా స్పీకర్లు ఉంచినట్లైతే అవి మీ బ్లైండ్ పెట్స్ కు సూచికగా ఉపయోగపడతాయి. మీరు బయటకు వెళ్లినప్పుడు మీ పెట్స్ కు అవి సరైన మార్గ దిశానిర్దేశం చేస్తుంది. సోఫా, బెడ్లపై కూడా మీ పెట్స్ ను అనుమతిస్తే వాటి విశ్వాసం మరింత పెరిగి ఫ్రీగా సంచరించగలుగుతాయి. మీకు బంగళా కాంపౌండ్ లో కంచెలు వేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. పాక్షిక అంధత్వం కలిగిన పెట్స్ ఉంటే ఇంటిలో రంగు రంగుల లైటింగ్ వేయడం చేయకూడదు. కొన్ని వాయిస్ సందేశాలను రూపొందించి మీ పెట్స్ ఆ ఆదేశాలను పాటించేలా శిక్షణ ఇవ్వాలి.
పెట్ డాగ్స్ ల్లో అనేక కారణాల వల్ల అంధత్వం ఏర్పడుతుందని గుర్తుంచుకోండి. మీ ప్రేమకు, సంరక్షణకు అంధత్వం ఒక అడ్డంకి కారాదు. మీరు మీ బ్లైండ్ పెట్స్ పై చూపే కొద్దిపాటి ప్రేమ వాటిపై మీ బంధాన్ని మరింత బలపరుస్తుందని పశువైద్యులు సూచిస్తున్నారు.
Related News
Mancherial: మంచిర్యాలో దారుణం.. శిశువు మృతదేహాన్ని తినేసిన కుక్కలు
Mancherial: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన గంగక్క అనే మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురికి ఇటీవల వివాహం జరిగింది. ఇక రెండో కుమార్తె పెళ్లీడుకు వచ్చింది. అయితే గంగక్కకు మాత్రం కొడుకు కావాలనే ఆశ ఉండేది. ఈ క్రమంలో మగ శిశువు కోసం ఎదురుచూసిన గంగక్క మరోసారి గర్భందాల్చింది. బుధవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆడ శి�