Potlakaya Masala Rolls: వెరైటీగా ఉండే పొట్లకాయ మసాలా రోల్స్.. ట్రై చేయండిలా?
మామూలుగా మనం పొట్లకాయతో అనేక రకాల వంటలు తినే ఉంటాం. పొట్లకాయ కర్రీ, పొట్లకాయ వేపుడు, పొట్లకాయ మసాలా కర్రీ, పొట్లకాయ వడలు ఇలా అనేక రకా
- By Anshu Published Date - 05:30 PM, Wed - 13 December 23

మామూలుగా మనం పొట్లకాయతో అనేక రకాల వంటలు తినే ఉంటాం. పొట్లకాయ కర్రీ, పొట్లకాయ వేపుడు, పొట్లకాయ మసాలా కర్రీ, పొట్లకాయ వడలు ఇలా అనేక రకాల వంటకాలు ఉన్నా తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా పొట్లకాయ మసాలా రోల్స్ తిన్నారా. వినడానికి కాస్త వెరైటీగా ఉన్న ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పొట్లకాయ మసాలా రోల్స్ కు కావాల్సిన పదార్థాలు
పొట్లకాయ – 1
ఉల్లిపాయలు – 2
బంగాళాదుంపలు – 2
క్యారెట్ -1
పచ్చి బఠాణీలు – అరకప్పు
వెల్లుల్లి – 2 రెమ్మలు
నిమ్మకాయ – అరచెక్క
పచ్చిమిర్చి – 3
కొత్తిమీర – 3 రెమ్మలు
లవంగాలు – 2
పసుపు – 1/4 టీ స్పూను
గరం మసాలా -1 టీ స్పూను
కారం – తగినంత
బియ్యప్పిండి – అరకప్పు
శనగపిండి – అరకప్పు
నూనె – సరిపడా
ఉప్పు – తగినంత
పొట్లకాయ మసాలా రోల్స్ తయారీ విధానం:
ముందుగా పొట్లకాయను శుభ్రంగా కడిగి రెండు అంగుళాల పొడవుతో ముక్కలుగా తరుగుకోవాలి. దాంట్లో గింజలు తీసేసి ఉప్పు రాసుకోవాలి. వాటిని ఒక గిన్నెలో వేసుకుని పక్కన ఉంచాలి. క్యారెట్, పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయల ముక్కలు మరో గిన్నెలో పెట్టి కుక్కర్లో అయిదు నిమిషాల పాటు ఉడికించాలి. అలాగే బంగాళా దుంపలను కూడా కోసం కుక్కర్లోనే పది నిమిషాలు ఉడకబెట్టాలి. బంగాళాదుంపల ముక్కలను చల్లార్చుకుని తొక్క తీసి మెత్తగా ముద్ద చేసుకోవాలి. బియ్యప్పిండి, శనగపిండిలో తగినంత నీరు పోసి పేస్టులా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. బాణలీలో కొంచెం నూనె పోసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తరువాత గరం మసాలా, లవంగాలు, పసుపు, కారం, పచ్చి మిరపకాయలు, బంగాళాదుంప ముద్ద వేసి బాగా కలపాలి. ఉప్పు సరిపోకపోతే మరికాస్త వేసుకోవాలి. రుచి చూసుకుని కిందకి దించి, చల్లారాక నిమ్మకాయ రసం పిండి అందులో కలుపుకోవాలి. ఉడకబెట్టిన పొట్లకాయ ముక్కలలో ఈ కూర ముద్దను కూరి, చివరలను కలిపి, సిద్ధంగా వుంచుకున్న పిండిలో ముంచి తీసి నూనెలో వేయించుకోవాలి. అంతే పొట్లకాయ మసాలా రోల్స్ రెడీ.