Pepper Corn Rice: వెరైటీగా పెప్పర్ కార్న్ రైస్.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా?
మామూలుగా మనం ఇంట్లో జీరా రైస్, గోబీ రైస్, ఫ్రైడ్ రైస్, గీ రైస్, టమోటా రైస్, ఎగ్ రైస్ అంటూ రైస్ తో రకరకాల వంటలను చేసుకొని తింటూ ఉంటాం. అయిత
- By Anshu Published Date - 08:30 PM, Wed - 23 August 23

మామూలుగా మనం ఇంట్లో జీరా రైస్, గోబీ రైస్, ఫ్రైడ్ రైస్, గీ రైస్, టమోటా రైస్, ఎగ్ రైస్ అంటూ రైస్ తో రకరకాల వంటలను చేసుకొని తింటూ ఉంటాం. అయితే రైస్ తో ఎప్పుడూ ఒకే రకమైన వంటలు కాకుండా అప్పుడప్పుడు కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలని అనుకున్న వారు పెప్పర్ కార్న్ రైస్ ట్రై చేయడం వల్ల ఇది తినడానికి ఎంతో టేస్టీగా స్పైసీగా కూడా ఉంటుంది. మరి ఈ పెప్పర్ కార్న్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పెప్పర్ కార్న్ రైస్ కి కావాల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్ – 1 కప్పు
మిరియాల పొడి – 2 స్పూన్స్
మొక్కజొన్న – 1//2 కప్పు
నెయ్యి – 2 స్పూన్స్
అజినోమోటో – చిటికెడు
సోయాసాస్ – 1//2 స్పూన్
జీలకర్ర – 1 స్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
పెప్పర్ కార్న్ రైస్ తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా ఒక పాన్ లో కొద్దిగా నూనె వేయాలి. తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మొక్కజొన్న గింజలు, మిరియాలపొడి, అజినమోటో, ఉప్పు, సోయాసాస్ వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ముందుగా వండి చల్లారబెట్టిన బాస్మతి రైస్ ను అందులో వేసి బాగా కలపాలి. కావాల్సిన వాళ్ళు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు.