Papaya Seeds: బొప్పాయి తిని గింజలు పడేస్తున్నారా.. అయితే ఇది తెలిస్తే ఇక మీదట అలా చేయరు!
Papaya Seeds: కేవలం బొప్పాయి పండు మాత్రమే కాకుండా ఆ పండులోని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 08:00 AM, Wed - 15 October 25

Papaya Seeds: బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే. తరచుగా బొప్పాయి పండు ని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. చిన్నపిల్లల పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ పండును తినవచ్చు అని చెబుతున్నారు. అయితే కేవలం బొప్పాయి పండు వల్ల మాత్రమే కాకుండా దానిలోని గింజల వల్ల కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అయితే బొప్పాయిని తిని దానిలోపలి విత్తనాలను పడేస్తూ ఉంటారు. కానీ బొప్పాయి ఆకులు, బొప్పాయితో పాటుగా బొప్పాయి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివని చెబుతున్నారు. కాగా బొప్పాయి గింజల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని నేరుగా తింటే చేదుగా ఉంటాయట. కాబట్టి వాటిని ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత తినడం మంచిది అని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల గుండె సమస్యలు కూడా తగ్గుతాయట. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయని చెబుతున్నారు.
అంతేకాకుండా బీపిని కంట్రోల్ చేసే లక్షణాలు కూడా దీనిలో ఉన్నాయట. వీటిలోని ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు. అలాగేvచర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసే లక్షణాలు కూడా బొప్పాయి గింజల్లో ఉంటాయట. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని మృదువుగా చేసి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయని చెబుతున్నారు. బొప్పాయి గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవి జీర్ణక్రియను మెరుగుపరచడం, ఫైబర్, పోషకాలను అందించడం, మలబద్ధకాన్ని తగ్గించడం వంటివని చెబుతున్నారు. వీటిలో ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ ఎ, జింక్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎండబెట్టి, పొడిగా చేసి లేదా నేరుగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట.