Palakura Vadalu: కరకరలాడే పాలకూర వడలు సింపుల్ గా ఇంట్లోనే ట్రై చేయండిలా?
సాయంత్రం అయ్యింది అంటే చాలు ఇంట్లో పిల్లలు పెద్దలు ఏవైనా స్నాక్స్ చేసుకొని తినాలని అనుకుంటూ ఉంటారు. స్నాక్స్ అనగానే మనకు ముందుగా గుర్తు
- By Anshu Published Date - 05:30 PM, Wed - 14 February 24

సాయంత్రం అయ్యింది అంటే చాలు ఇంట్లో పిల్లలు పెద్దలు ఏవైనా స్నాక్స్ చేసుకొని తినాలని అనుకుంటూ ఉంటారు. స్నాక్స్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బజ్జీలు లేదా వడలు. ఇది ఎప్పుడు ఒకే విధమైన వడలు కాకుండా అప్పుడప్పుడు ఏమైనా కొత్త కొత్తగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా ఏమైనా కొత్తగా ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే ఇంట్లోనే సింపుల్ గా టేస్టీగా పాలకూర వడలను చేసుకోండిలా.
పాలకూర వడలకు కావలసిన పదార్థాలు :
శెనగపప్పు – ఒకటిన్నర కప్పు
పాలకూర – 1 కప్పు
పచ్చిమిర్చి – 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
కారం – 1 టీస్పూన్
మెంతి ఆకులు – 1 టీస్పూన్
మ్యాంగో పౌడర్ – అర టీస్పూన్
జీలకర్ర – 1 టీస్పూన
ఉప్పు – తగినంత
నూనె – డీప్ ఫ్రైకి తగినంత
తయారీ విధానం :
ముందుగా పాలకూరను బాగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. శెనగపప్పును మీరు వంట చేయాలనుకుంటున్న కనీసం 4 గంటల ముందు కడిగి నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకుని ఉదయమే చేసుకున్నా మంచిదే. పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. మెంతి ఆకులను శుభ్రం చేసుకోవాలి. శెనగపప్పు నానిన తర్వాత దానిని గ్రైండర్లో తీసుకుని చిక్కగా పేస్ట్ అయ్యే వరకు రుబ్బుకోవాలి. కొంచెం కచ్చా పచ్చాగా ఉంచితే మంచిది. తర్వాత శెనగపప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో జీలకర్ర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పాలకూర, మెంతికూర, మ్యాంగో పౌడర్ వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచి డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ వేసి అది కాగుతున్నప్పుడు.. శనగపిండి మిశ్రమాన్ని వడలుగా దానిలో వేసి రెండు వైపులా గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర వడలు రెడీ.