Onion Paratha: హోటల్ స్టైల్ ఆనియన్ పరోటా.. ఇలా చేస్తే లొట్టలు వేసుకుని తినేయాల్సిందే?
మామూలుగా చాలామంది ఎప్పుడూ ఒకే విధమైన వంటకాలు తిని తిని బోర్ కొడుతుందని కొత్తగా రెసిపీ లను ట్రై చేయాలనే అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కొత్త కొత్త రె
- By Anshu Published Date - 07:15 PM, Sun - 3 December 23
మామూలుగా చాలామంది ఎప్పుడూ ఒకే విధమైన వంటకాలు తిని తిని బోర్ కొడుతుందని కొత్తగా రెసిపీ లను ట్రై చేయాలనే అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కొత్త కొత్త రెసిపీలు ఎలా తయారు చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీరు కూడా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా. అయితే ఈ రెసిపీ మీ కోసమే. హోటల్ స్టైల్ ఆనియన్ పరోటా ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆనియన్ పరోటాకి కావాల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు -4
గోధుమపిండి – 2 కప్పులు
కొత్తిమీర – తగినంత
జీలకర్ర- అరస్పూన్
కసూరి మేతీ- స్పూన్
ధనియాలు- అరస్పూన్
కారంపొడి- అరస్పూన్
గరం మసాలా- పావు స్పూన్
నూనె – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
ఆనియన్ పరోటా తయారీ విధానం:
ముందుగా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని అందులో ఉప్పు వేసి పావుగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోధుమపిండిలో ఉప్పు, సరిపడా నీళ్లు పోసి మెత్తగా పిండిలా కలుపుకోవాలి. దీనిలో ఒక స్పూన్ నూనె కలిపి పావు గంట పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ధనియాలు, జీలకర్ర వేసి వేయించి తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను గట్టిగా పిండేసి నీళ్లు తీసేయాలి. ఉల్లిపాయ ముక్కల్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, ధణియాలు, జీలకర్రపొడి, కారం, ఉప్పు, గరం మసాలా, కసూపరీ మేతి వేసి కలుపుకోవాలి. తర్వాత గోధుమ పిండిని చిన్న ఉండల్లాగా చేసుకుని మధ్య ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి అన్ని అంచులు మూసేసి పరోటాలా మందంగా ఒత్తు కోవాలి. పెనం మీద నూనె వేసి పరోటాలను బంగారు రంగ వచ్చేంత వరకు కాల్చాలి. రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే వేడి క్రిస్పీ స్పైసీ ఆనియన్ పరోటా రెడీ.