HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Oil Free Kichidi Recipe

Oil Free Kichidi : నూనె, నెయ్యి లేకుండా దాల్ ఫ్రీ కిచిడీ.. ఇలా చేయండి..

ఈ కిచిడీని మనం మరింత రుచిగా.. ఆరోగ్యానికి రుచిగా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసేలా నూనె, నెయ్యి వేయకుండా కమ్మగా, రుచిగా కూడా ఈ కిచిడీని తయారు చేసుకోవచ్చు.

  • Author : News Desk Date : 31-01-2024 - 11:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
oil free dal kichidi
oil free dal kichidi

Oil Free Kichidi : దాల్ కిచిడీ. బ్రేక్ ఫాస్ట్ లోకి అయినా.. లంచ్ లోకి అయినా.. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా అయినా.. పర్ ఫెక్ట్ గా సెట్ అయ్యే వంటకం. పెసరపప్పు, బియ్యంతో కలిపి చేసే ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈ కిచిడీని మనం మరింత రుచిగా.. ఆరోగ్యానికి రుచిగా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసేలా నూనె, నెయ్యి వేయకుండా కమ్మగా, రుచిగా కూడా ఈ కిచిడీని తయారు చేసుకోవచ్చు. నూనె లేకుండా.. ఆరోగ్యకరమైన కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో

ఆయిల్ ఫ్రీ దాల్ కిచిడీ తయారీకి కావలసిన పదార్థాలు..

బియ్యం – 1 గ్లాస్

పెసరపప్పు – అరగ్లాస్

జీలకర్ర – అర టీ స్పూన్

దాల్చిన చెక్క – చిన్న ముక్క

లవంగాలు – 3

యాలకులు – 3

బిర్యానీ ఆకు – 2

స్టోన్ ఫ్లవర్ – కొద్దిగా

మిరియాలు – 6

అనాసపువ్వు -1

పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ -1

తరిగిన పచ్చిమిర్చి – 5

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్

తరిగిన బంగాళదుంప – 1

తరిగిన బీన్స్ – 6

తరిగిన క్యారెట్ – 1

జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్

ఎండుకొబ్బరి పొడి – 2 టీ స్పూన్స్

ఉప్పు – తగ్గినంత

పసుపు – పావు టీ స్పూన్

నీళ్లు – 3 గ్లాసులు

తరిగిన కొత్తిమీర – కొద్దిగా

తరిగిన పుదీనా – కొద్దిగా

ఆయిల్ ఫ్రీ దాల్ కిచిడీ తయారీ విధానం

ముందుగా బియ్యాన్ని, పప్పును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. కుక్కర్లో జీలకర్ర, మసాలా దినుసులు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి మాడిపోకుండా ఉండేందుకు కొద్దిగా నీళ్లుపోసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కూరగాయ ముక్కలు, జీడిపప్పు వేసి వేయించాలి.

వాటన్నింటినీ మాడిపోకుండా కొద్దికొద్దిగా నీరు పోస్తూ వేయించుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత ఎండుకొబ్బరి పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. తర్వాత నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేసి వేయించాలి. బియ్యంలో ఉన్న నీరంతా పోయేంతవరకూ బాగా వేయించాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. నీళ్లుపోసి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి పెద్దమంటపై 2 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడంతో ఎంతో రుచిగా ఉండే కిచిడీ రెడీ. ఇందులో రైతు కలిపి తింటే.. సూపర్ గా ఉంటుంది. రుచికి రుచికి. ఆరోగ్యానికి ఆరోగ్యం.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dal kichidi
  • food
  • kichidi for health
  • oil free kichidi recipe

Related News

Gismat Jail Mandi

Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి ప‌దార్థాలు, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపల

  • Food safety

    HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

Latest News

  • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

  • CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

  • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd