Oats Dosa : ఓట్స్ తో దోసె.. సింపుల్ గా ఇలా చేసేయండి.. హెల్త్ కు చాలా మంచిది..
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని.. పైన చెప్పిన క్వాంటిటీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసి పౌడర్ లా చేసుకోవాలి. తర్వాత గిన్నెలోకి రుబ్బిన ఓట్స్ పొడిని తీసుకుని జీలకర్ర, బియ్యంపిండి, రవ్వ వేయాలి.
- By News Desk Published Date - 08:58 PM, Mon - 29 January 24

Oats Dosa : ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే డాక్టర్లు కూడా డైట్ కి సజెస్ట్ చేస్తారు. వీటిని ఎప్పుడూ ఒకేలా తింటే బోర్ కొడుతుంది. ఎప్పుడూ పాలతోనే కాకుండా.. అప్పుడప్పుడూ కాస్త వెరైటీగా ట్రై చేయండి. ఓట్స్ తో దోసె, ఇడ్లీ, ఉప్మా కూడా చేసుకోవచ్చు. డైట్ చేసేవారికి కూడా ఇది ఉపయోగకరం.
ముఖ్యంగా ఓట్స్ దోసె తయారు చేయడం చాలా సులభం. చాలా రుచిగా కూడా ఉంటుంది. రవ్వ దోసె మాదిరిగా ఉంటుంది కాబట్టి.. అందరికీ నచ్చుతుంది. మరి అంత టేస్టీగా ఉండే ఓట్స్ దోసె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
ఓట్స్ దోసెకు కావలసిన పదార్థాలు..
ఓట్స్ – 1/2 కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
జీలకర్ర – 1/2 టేబుల్ స్పూన్స్
బియ్యంపిండి – 1/4 కప్పు
రవ్వ – 1/4 కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2 టేబుల్ స్పూన్స్
కరివేపాకు – కొద్దిగా
కొత్తిమీర – తరిగినది కొద్దిగా
తురిమిన అల్లం – 1/2 టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1
పెరుగు – 1/4 కప్పు
నీరు – తగినంత
ఓట్స్ దోసె తయారీ విధానం
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని.. పైన చెప్పిన క్వాంటిటీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసి పౌడర్ లా చేసుకోవాలి. తర్వాత గిన్నెలోకి రుబ్బిన ఓట్స్ పొడిని తీసుకుని జీలకర్ర, బియ్యంపిండి, రవ్వ వేయాలి. తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు, అవసరమైన నీరు వేసి బాగా కలిపి.. రవ్వ దోసె పిండిలా కలుపుకోవాలి. తర్వాత పిండిని 10-15 నిమిషాలు నానబెట్టాలి.
ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ ను పొయ్యిపై పెట్టి పెనం వేడయ్యాక అందులో.. కలిపి పెట్టుకున్న పిండిని దోసెలా వేసుకోవాలి. దానిపైనా, చుట్టూ నూనె పోసి క్రిస్పీగా అయ్యాక దోసె తీసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ దోసె రెడీ. ఇందులోకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కలిపి తింటే.. ఆహా ఆ టేస్టే వేరు.