New Disease: శృంగారం ఎక్కువగా చేస్తున్నారా.. అయితే ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే?
స్త్రీ, పురుషులకు శృంగారం అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. ఆడ మగ మధ్య జరిగే ఒక సహజ ప్రక్రియ శృంగారం. అయితే టెక్నాలజీ డెవలప్ అయ్యి ఈ శ
- By Anshu Published Date - 04:40 PM, Tue - 13 June 23

స్త్రీ, పురుషులకు శృంగారం అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. ఆడ మగ మధ్య జరిగే ఒక సహజ ప్రక్రియ శృంగారం. అయితే టెక్నాలజీ డెవలప్ అయ్యి ఈ శృంగారం విషయంలో ఇప్పటికే ఎంతోమంది వైద్యులు ఎన్నో రకాల విషయాలను తెలిపినప్పటికీ శృంగారం విషయంలో ఉన్న అపోహలు భయాలు మాత్రం ఇంకా తొలగిపోవడం లేదు. కొందరు శృంగారాన్ని ఇష్టపడి చేస్తే మరి కొంతమంది దానిని ఒక ఉద్యమంలో భావిస్తూ ఉంటారు. మరి కొంతమంది నిరంతరం శృంగారం పైనే ఆసక్తిని చూపిస్తూ శృంగారం చేయాలి అని పరితపిస్తూ ఉంటారు.
శృంగారం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. అలా అని శృతిమించి శృంగారంలో పాల్గొంటే నష్టాలు కూడా తప్పవు. అయితే గోనేరియా అనేది ఒక లైంగిక వ్యాధి. ఈ లైంగిక వ్యాధి ఎక్కువమందితో సెక్స్ లో పాల్గొనే వారికి ఉంటుంది వస్తుంది. ముఖ్యంగా 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువకులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. 82.4 మిలియన్ల మంది కొత్తగా ఈ గోనేరియా అనే లైంగిక వ్యాధి బారిన పడ్డారు. కాగా ఈ లైంగిక వ్యాధి నైస్సెరియా గోనేరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల కలిగే రెండవ అత్యంత సర్వసాధారణమైన లైంగిక సంక్రమణ. ఇది జననేంద్రియాలను పురుష నాళం, గొంతు వ్యాధులకు కారణం అవుతుంది.
ఇకపోతే ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అన్న విషయానికి వస్తే.. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, విపరీతమైన యోని ఉత్సర్గ, ఆడవారిలో పీరియడ్స్ మధ్య అసాధారణమైన ఉత్సర్గ, రక్తస్రావం, పురుషాంగం నుంచి పసుపు లేదా ఆకుపచ్చ ఉత్సర్గ, పురుషాంగం వాపు, వృషణాల నొప్పి, ప్రేగు కదలికల్లో ఇబ్బంది లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.