Natu Kodi Pulusu: ఎంతో స్పైసీగా ఉండే నాటుకోడి పులుసు ఇలా చేస్తే చాలు లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?
చికెన్ ప్రియులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే వంటలలో నాటుకోడి పులుసు కూడా ఒకటి. మామూలు చికెన్ తో మనం చికెన్ కబాబ్ చికెన్ కర్రీ చికెన్ 65 లాంటివి
- By Anshu Published Date - 07:30 PM, Tue - 23 January 24

చికెన్ ప్రియులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే వంటలలో నాటుకోడి పులుసు కూడా ఒకటి. మామూలు చికెన్ తో మనం చికెన్ కబాబ్ చికెన్ కర్రీ చికెన్ 65 లాంటివి చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఈ వంటలు అన్నీ ఒక ఎత్తు అయితే నాటుకోడి పులుసు ఒక ఎత్తు అని చెప్పవచ్చు. చాలామంది కేవలం రసం కోసమైనా సరే నాటు కోడిని కోసుకొని తింటూ ఉంటారు. మరి నాటుకోడి పులుసును ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నాటుకోడి పులుసుకు కావలసిన పదార్ధాలు:
నాటుకోడి – 1
ఉల్లిపాయలు – 2
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర -1 కట్ట
కారం – 2 చెంచాలు
ఉప్పు – తగినంత
పసుపు – 1 చెంచా
ధనియాల పొడి – 2 చెంచాలు
ఎండు కొబ్బరి – 1 చిప్ప
గసగసాలు – 2 చెంచాలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 చెంచాలు
నూనె – 4 చెంచాలు
నాటుకోడి పులుసు తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా నాటుకోడిని తీసుకొని దానికి పసుపు, ఉప్పు కొద్దిగా నూనె పట్టించి, చితుకుల మంటపై లేదా బార్బి క్యూ పై అటూ ఇటూ తిప్పుతూ కాల్చాలి. లేదా అవెన్ లో 180 డిగ్రీల వద్ద 10 నిమిషాల పాటు ఉంచాలి. ఆతరువాత నాటుకోడి చల్లారే వరకూ పక్కన పెట్టి అది చల్లారిన తరువాత దానిని తీసుకొని బాగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలకు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేపాలి. ఉల్లిపాయలు వేగాక మసాలా పట్టించిన నాటుకోడి ముక్కలు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లుపోసి సన్నని మంటమీద చికెన్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఎండుకొబ్బరిని సన్నగా తరిగి పొడిగా వేపుకోవాలి. గసగసాలు కూడా వేపుకోవాలి. ఎండుకొబ్బరి, గసగసాలు కలిపి మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ఉడికిన చికెన్ లో వేసి బాగా కలపాలి. సన్నని మంటమీద ఇంకో పదినిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిన తరువాత దించి సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించాలి. రుచికరమైన నాటు కోడి పులుసు రెడీ.