Natu Kodi Pulusu: నాటుకోడి పులుసు ఇలా చేస్తే చాలు.. లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?
చికెన్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే వాటిలో నాటుకోడి పులుసు కూడా ఒకటి. మరి ముఖ్యంగా రెస్టారెంట్ స్టైల్ లో కాకుండా ఒక పల్లెటూరి స్టైల్ లో నాటుకోడ
- By Nakshatra Published Date - 08:20 PM, Mon - 4 September 23
చికెన్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే వాటిలో నాటుకోడి పులుసు కూడా ఒకటి. మరి ముఖ్యంగా రెస్టారెంట్ స్టైల్ లో కాకుండా ఒక పల్లెటూరి స్టైల్ లో నాటుకోడి పులుసు చేస్తే చాలామంది ఇందులోకి రాగి సంగటి వేసుకొని బాగా తింటూ ఉంటారు. నాటుకోడి పులుసులో ముక్కలు కాకపోయినా కనీసం పులుసు కోసం తినేవారు కూడా చాలామంది ఉన్నారు. మరి నాటుకోడి పులుసు అంత టేస్టీగా రావాలంటే ఎలా చేయాలి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావలసిన పదార్ధాలు:
నాటుకోడి – 1
ఉల్లిపాయలు – 2
కరివేపాకు -2 రెమ్మలు
కొత్తిమీర -1 కట్ట
కారం – 2 చెంచాలు
ఉప్పు – తగినంత
పసుపు – 1 చెంచా
ధనియాల పొడి – 2 చెంచాలు
ఎండు కొబ్బరి – 1 చిప్ప
గసగసాలు – 2 చెంచాలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 చెంచాలు
నూనె – 4 చెంచాలు
నాటుకోడి పులుసు తయారీ విధానం
ఇందుకోసం ముందుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసిన నాటుకోడిని తీసుకుని ఈ ముక్కలకు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేపాలి. ఉల్లిపాయలు వేగాక మసాలా పట్టించిన నాటుకోడి ముక్కలు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లుపోసి సన్నని మంటమీద చికెన్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఎండుకొబ్బరిని సన్నగా తరిగి పొడిగా వేపుకోవాలి. గసగసాలు కూడా వేపుకోవాలి. ఎండుకొబ్బరి, గసగసాలు కలిపి మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ఉడికిన చికెన్ లో వేసి బాగా కలపాలి. సన్నని మంటమీద ఇంకో పదినిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిన తరువాత దించి సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్ పులుసు రెడీ. ఇలా చేస్తే చాలు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు లొట్టలు వేసుకొని మరి తినేస్తారు.
Related News
Natu Kodi Pulusu: ఎంతో స్పైసీగా ఉండే నాటుకోడి పులుసు ఇలా చేస్తే చాలు లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?
చికెన్ ప్రియులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే వంటలలో నాటుకోడి పులుసు కూడా ఒకటి. మామూలు చికెన్ తో మనం చికెన్ కబాబ్ చికెన్ కర్రీ చికెన్ 65 లాంటివి