HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Mysore Bonda Recipe Without Maida

Mysore Bonda : మైదాపిండి లేకుండా మైసూర్ బోండాలను తయారు చేయండిలా..

హోటల్స్, రోడ్ల పక్కన ఉండే బండ్లమీద లభించే మైసూర్ బోండాలకే రుచెక్కువ. వాటిని తింటే.. ఆరోగ్యం కూడా పాడవుతుంది. బరువు పెరుగుతాం.

  • Author : News Desk Date : 04-11-2023 - 10:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
mysore bonda recipe
mysore bonda recipe

Mysore Bonda : మైసూర్ బోండాలు. ఉదయం పూట టిఫిన్ గా లేదా.. సాయంత్రం పూట స్నాక్ ఐటమ్ గా తినే ఫుడ్. వీటిని వండేందుకు ఎక్కువగా మైదాపిండిని వాడుతారన్న విషయం తెలిసిందే. ఇళ్లలో కంటే.. బయట హోటల్స్, రోడ్ల పక్కన ఉండే బండ్లమీద లభించే మైసూర్ బోండాలకే రుచెక్కువ. వాటిని తింటే.. ఆరోగ్యం కూడా పాడవుతుంది. బరువు పెరుగుతాం. ముఖ్యంగా ఇందులో వాడే మైదాపిండి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కానీ తినకుండా ఉండలేం. వాటికుండే టేస్ట్ అలాంటిది మరి. వేడి వేడి మైసూర్ బోండాల్లో.. పల్లీల చట్నీ, టొమాటో చట్నీ కాంబినేషన్ తో తింటే ఆ రుచేవేరు.

మరి అంతరుచిగల్లా మైసూర్ బోండాలను తెలిసి తెలిసి రోజూ తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకోలేం కదా. అందుకే.. మైదాపిండి లేకుండా.. ఆరోగ్యానికి హాని కలుగకుండా.. గోధుమపిండితో మైసూర్ బోండాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

గోధుమపిండి బోండాల తయారీకి కావలసిన పదార్థాలు

గోధుమపిండి – 1 కప్పు
బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
జీలకర్ర – 1 టీ స్పూన్
వంటసోడా – 1/4 టీ స్పూన్
పుల్లటి పెరుగు – 1 కప్పు
నూనె – డీప్ ఫ్రై కు సరిపడా.

మైసూర్ బోండా తయారీ విధానం..

ఒక గిన్నెలోకి గోధుమపిండిని తీసుకుని.. అందులో బియ్యంపిండి, ఉప్పు, జీలకర్ర, వంటసోడా వేసి కలుపుకోవాలి. తర్వాత పెరుగు వేసి.. తగినన్ని నీళ్లు పోసి బోండం వేసేందుకు వీలుండేలా పిండిని కలుపుకోవాలి. తర్వాత దానిపై మూతపెట్టి 15 నిమిషాలపాటు పక్కకు ఉంచుకోవాలి. పిండిని మరోసారి కలుపుకున్నాక కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.

ఇప్పుడు పిండిని చేతిలోకి తీసుకుని గుండ్రంగా చేసుకుని నూనెలో వేసుకోవాలి. మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యేంతవరకూ వేయించుకుని.. ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే.. హెల్దీ మైసూర్ బోండాలు రెడీ. వీటిని ఎంచక్కా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని తినడమే.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • atta mysore bonda
  • food
  • healthy bonda
  • mysore bonda
  • mysore bonda without maida

Related News

Gismat Jail Mandi

Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి ప‌దార్థాలు, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపల

    Latest News

    • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

    • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

    • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

    • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

    • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

    Trending News

      • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd